తూర్పు గోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈరోజు అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాపాక పై పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు నమోదు చేశారు. మలికిపురం ఎస్సై రామారావు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెండ్రోజుల క్రితం రాపాక అనుచరులు పోలీసు స్టేషన్ ను ముట్టడించారు. పోలీస్ స్టేషన్ పై దాడి ఆస్తుల ధ్వంసం అధికారుల విధులకు ఆటంకం కల్పించారని నేరంపై ఎమ్మెల్యేతో సహా పలువురు జనసేన కార్యకర్తలపై పిడి పిపి యాక్టు కింద కేసులు నమోదు చేశారు.


కేసుల గురించి తెలిసిన ఎమ్మెల్యే రాపాక పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన అరెస్టు కోసం రాత్రంతా హైడ్రామా నడిచింది. చింతలమోరిలోని ఆయన నివాసానికి వెళ్లగా రాపాక ఇంట్లో లేకపోవటంతో పోలీసులు వెనుదిరిగారు.


ఆదివారం సాయంత్రం నాడు మొత్తం తొమ్మిది మంది పేకట ఆడుతుంటే మలికిపురం ఎస్ఐ కె రామారావు అరెస్ట్ చేసారు. ఈ నేపథ్యంలో రాపాకా ముఖ్య అనుచరులు కొంత మంది అడ్డుకునే ఆ తొమ్మిది మందిని విడిచిపెట్టాలన్న వాగ్వాదాలు ఆడారు. ఈనేపధ్యంలో ఎస్ఐ వీళ్ళపైన 183/2019 గ్యాంబ్లింగ్ యాక్ట్ నమోదు చేసారు.


ఎస్ఐ కె రామారావు అరెస్ట్ చేసిన వాళ్ళను వదిలిపెడతాము స్టేషన్ కి వచ్చి విడిపించుకోమని చెప్పగా, ఆగ్రహానికి గురి అయినా రాపాక అనుచరులు మలికిపురం పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారు మరియు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల మీద దాడిచేసారని రాపాక ఆయన అనుచరుల ఇంకా సెక్షన్ 143, 147, 148, 341, 353,  427 r /w, 149 IPC కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యం లోనే ఆయన అనుచరులను మరియు రాపాకను  అరెస్టు చేసేందుకు రాజోలు దీవిలోని పోలీస్ స్టేషన్ పరిధి లో పెద్ద హై డ్రామా జరిగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.


ఒక ప్రజాప్రతినిధిని అదుపులోకి తీసుకోవాలంటే తప్పనిసరిగా స్పీకర్ అనుమతి ఉండాల్సి ఉంటుంది. మరి స్పీకర్ అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారుల విధులకు ఆటంకం కల్పించారన్నా నేరంపై ఎమ్మెల్యేతో సహా పలువురు జనసేనకార్యకర్తలపై పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.


ఇది ఇలా ఉంటే కేసుల గురించి తెలిసిన ఎమ్మెల్యే పోలీసులకు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పరారి అయ్యారు. అరెస్టు కోసం రాత్రంతా హైడ్రామానడిచింది. ఇప్పుడు కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. చింతలమోరి లోని ఆయన నివాసానికి వెళ్లారు కానీ ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవటంతో పోలీసులు వెనుదిరిగారు. కానీ మధ్యాహ్నానికల్లా అదుపు లోకితీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: