ఇప్పటి వరకు లోకేష్ మాత్రమే అనుకున్నాము .. ఇప్పుడు చంద్రబాబు కూడా ట్విట్టర్ లో కామెడీ చేస్తున్నారు. ట్వీట్ చేయడం మళ్ళీ దానిని డిలీట్ చేయడం ఇది బాబుగారి ట్విట్టర్ వ్యవహారం.  తెలుగు దేశం పార్టీ ప్రజా క్షేత్రంలో ఓడిపోయి కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. అయితే అధికార పార్టీ మీద బురద చల్లడమో, లేదా వారి మీద అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తే గాని ప్రతి పక్ష పార్టీ బతకలేదు. అయితే అదేందో గాని చంద్రబాబు అండ్ కో ట్విట్టర్ లో స్పదించిన అడ్డంగా దొరికి పోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు లేనిది ఉన్నదని, నిమిషానికో మాట చెప్పి ప్రజలను బోల్తా కొట్టించాలని ట్రై చేశారు. కానీ కుదరలేదు.


ఎందుకంటే పచ్చ మీడియా కంటే సోషల్ మీడియా స్పీడ్ గా ఉంటుంది. నిమిషాల్లో నిజాన్ని పసిగట్టగలదు. అయితే నారా లోకేష్ చాలా రోజుల నుంచి మీడియా ముందుకు రాకుండా ట్విట్టర్ లో రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్విట్టర్ లో రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఇంతక ముందు ఆశా వర్కర్స్ గురించి ఒక ఫోటో పెట్టి అందులో జగన్ ఫొటోకు పాలు పోస్తూ .. మరో పక్క జగన్ దిష్టి బొమ్మను ఉరేగిసున్నట్టు ఒక ఫోటోను పోస్ట్ చేశారు.


కానీ ఇది పచ్చ మీడియా కాదు కదా .. అన్నిటినీ దాచడానికి .. నెటిజన్స్ రెచ్చిపోయి ఆ ఒరిజినల్ ఫోటో ఎక్కడిదో చూపిస్తూ, బాబును ఒక ఆట ఆడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బాబు ట్విట్టర్లో దొరికిపోయారు. ట్విట్టర్లో బాబు చెబుతూ నా పరిపాలనలో 21 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని .. నీరు  చెట్టు , చెక్ డాం లను కట్టడం వల్ల ఈరోజు కృష్ణమ్మ, గోదావరి పరుగులు తీస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ నీరు  చెట్టు కు కృష్ణమ పరవళ్ళుకు ఏమైనా సంబంధం ఉందా ? దీనితో నెటిజన్స్ ఒక ఆట ఆడుకున్నారు. చివరికి బాబు గారికి అసలు విషయం అర్ధమయ్యి, ట్వీట్ డిలీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: