ఏపీలో రాజకీయం రసకందాయంలో పడబోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలుగుదేశం పార్టీ నిండా మునిగిపోయింది. అయిదేళ్ళ వరకూ టీడీపీ వూసు ఎవరికీ అవసరం లేదు. ఇకపోతే అధికారమే పరమావధిగా అంతా భావిస్తున్న వేళ ప్రతిపక్ష టీడీపీలో ఎమ్మెల్యేలుగా గెలిచి మాత్రం ఏం లాభమని పసుపు తమ్ముళ్ళు తెగ చింతిస్తున్నారుట. దాంతో వారు ఎక్కడ వీలు చిక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు.


టీడీపీ ఎమ్మెల్యేల ఫస్ట్ చాయిస్ మాత్రం వైసీపీగానే ఉందని అంటున్నారు. జగన్ వైపే వారి చూపు ఉందిట. జగన్ సరేనంటే దూకేందుకు రెడీ అంటున్నారుట. ఆ విధంగా టీడీపీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో పదిమంది ఎమ్మెల్యేలు ఇపుడు వైసీపీ వైపు చూస్తున్నారుట. జగన్ కి వారు టచ్ లోకి వస్తున్నారుట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు. జగన్ క్యాబినేట్లో మంత్రిగా ఉన్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఆయన తాజాగా పెద్ద బాంబే పేల్చారు. 


ఏపీలో టీడీపీ ఇలా ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు కాదు, జగనే అనుకోవాల్సివస్తోంది మరి. ఎందుకంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ తన పార్టీలో చేరమని జగన్ షరతు పెట్టారు. దాంతోనే ఇపుడు చాలా మంది దూకేందుకు రెడీగా ఉన్నా రాజీనామాకు మాత్రం సిధ్ధంగా లేరు. అయితే పదిమంది వరకూ టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ వైపు రావడం మాత్రం సంచలనమే. 


ఆ సంఖ్య మరింతగా పెరిగి టీడీపీ వైసీపీలోకి విలీనం అంటూ స్పీకర్ కి  లేఖ ఇస్తే మాత్రం రాజీనామాల ప్రసక్తే లేకుండా వైసీపీలో అంతా చేరిపోవచ్చు. ఇపుడు పదిమంది అయ్యారు. జగన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ, ఆయన ఓకే అనేస్తే  మొత్తానికి మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు చేరిపోతారని మంత్రి ముత్తంశెట్టి అన్న మాటలు చంద్రబాబు గుండె గుభేల్మనిపించేలా  ఉన్నాయట. చూడాలి, ఈ పది నంబర్ కాస్తా పెరిగితే మాత్రం అనర్హత వేటు వేయకుండానే వైసీపీలోకి హ్యాపీగా చేరిపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: