దేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి భద్రత కుదింపు కేసులో హైకోర్టులో ఊరట లభించింది.  ప్రభుత్వం నిర్ణయం మేరకు ఒక సీఎస్ వోనే కొనసాగించాలని..కాన్వాయ్ లో జామర్ కేటాయించాలని సూచించింది హైకోర్టు. క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే విషయంలో ఎన్ఎస్ జీ, స్టేట్ సెక్యూరిటీ మద్య అభిప్రాయభేదాలు రావడం అప్పట్లో సంచలనంగా మారింది.  అయితే ఈ విషయంపై మూడు నెలల్లోగా ఓ నిర్ణయానికి రవాలని హైకోర్టు ఆదేశించింది.  చంద్రబాబుకి మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని కోర్టు సూచించింది. 

ఈ విషయంపై నిర్ణయానికి  వచ్చాక సీపీటీ (క్లోజ్ ప్రొటెక్షన్ టీం) విధులు ఎవరు నిర్వహిస్తారో ఆ విభాగం భద్రత అధికారి.. పిటిషనర్‌కు తెలియజేస్తూ (5+2) భద్రత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్‌వోనే కొనసాగించాలన్నారు.  అయితే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గతంలో మావోయిస్టులకు టార్గెట్ గా ఉన్నారని..అప్పట్లో అలిపిరి ఘటన చంద్రబాబు నాయుడు దాదాపు చావు నుంచి తప్పించుకొని బతికి బయటపడ్డ విషయం తెలిసిందే.  ఈ విషయంలోనే అప్పటి నుంచి ఆయనకు జట్ కేటగిరి ప్రొటెక్షన్ ఇస్తూ వస్తున్నారు.

అంతే కాదు ఆయన కుటుంబ సభ్యులకు కూడా భారీ భద్రత ఏర్పాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీ పాలన కొనసాగుతుంది.  ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి భారీ సెక్యూరిటీ కుదించివేశారు.   కాగా, చంద్రబాబు భద్రతపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో రెండు వారాల క్రితమే వాదనలు ముగిశాయి. ఎన్‌ఎస్‌జీ, ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు తరపున లాయర్లు తమ వాదనలు వినిపించారు.

ఈ మేరకు హైకోర్టు  ఆంధ్రప్రదేశ్ తరపున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్‌ ని కొన్ని ప్రశ్నలు వేశారు.  ఆ మద్య ఈ వాదనలు విన్న కోర్లు తీర్పు రిజర్వ్ లో ఉంచింది.  తాజాగా ఈ తీర్పు వెలువరించింది.  ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబుకు భద్రత తగ్గించారని హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తీర్పును వెలువరించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: