కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పరిధి పేట గ్రామం లో ఫరీద్మియాలో అనే నవాబు కట్టిన ఫరీదా మహల్ ను మినీ తాజ్ మహల్ గా పిలుస్తున్నారు. సుమారు నాలుగు వందల ఏళ్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పరిధి మహల్ కు పాలకుల నిర్లక్ష్యం తో శిథిలావస్థ కు చేరుకుంది. నిజాం పాలకు లలో ఒకడైన ఫరీద్మియా నవాబ్ మాచరెడ్డి ప్రాంతం లో పాలించాడు. సంస్థానం లో ముప్పై నాలుగు గ్రామాలు ఉండేవి అయితే ఫరీద్ పేటలో తన నివాసం ఉండాలని పదిహేను ఎకరాల లో ఒక కోటను నిర్మించి అందులో గుర్రాలకు సంబంధించి నలభై అశ్వాలను ఏర్పాటు చేసుకున్నాడు తను విశ్రాంతి కి వచ్చి గుర్రా లతో సవారీ చేస్తూ సేద తీరేవారిని తెలిపారు. 


తన భార్య ఫరీదాబి మరణించటం తో ఆమెకు గుర్తుగా సమాధి ని మినీ తాజ్ మహల్ గా నిర్మించి అందులో సమాధి చేశాడు. అలాగే తాను చనిపోయిన తర్వాత నా భార్య సమాధి పక్కనే సమాధి చెయ్యాలని సూచించాడు. దీంతో తను చనిపోయిన తరువాత అతనిని మినీ తాజ్ మహల్ లో సమాధి చేశారు. ఈ పరిధి మహల్ లో వీరి సమాధుల పక్క నుంచి ఒక సొరంగ మార్గముంది అది దోమకొండ కోటకు అలాగే గంబీరావుపేట కోట వరకు సొరంగం ద్వారా దారి ఉంటుందని గ్రామస్తుల నమ్మకం. ఆ తరువాత పాలించిన వారు ఆ సొరంగ మార్గం ఉపయోగించేవారు కాదు.


 ఫరీదా మహల్ కు రెండు మినార్ లను ఏర్పాటు చేశారు దానిని పావురాల గుట్ట గా పిలుస్తారు. ప్రస్తుతం ఆ రెండు మినార్ లు శిథిలావస్థకు చేరి కూలిపోయాయి. ఫరీదా మహల్ వెనుక ఒక మసీదు ను ఏర్పాటు చేశారు భార్యా భర్తల ప్రేమ కు గుర్తు గా ఈ ఫరీదా మహల్ కట్టడం జరిగింది. ఈ మహల్ తాజ్ మహల్ ను పోలి ఉండటం తో మినీ తాజ్ మహల్ గా పిలవడం జరుగుతుంది. ఫరీదాబీ పేరు మీదుగా పరిధి పేట్ అనే గ్రామం ను పిలుస్తారు.   ప్రస్తుతం ఆ మహల్ పరిసర భాగమంతా అద్వానంగా తయారైంది. ఫరీదా మహల్ కు నాలుగు వందల ఎకరాల భూమి ఉండేది కానీ ప్రస్తుతం అది కబ్జా కు గురైందని గ్రామస్తులు చెబుతారు. 


మినీ తాజ్ మహల్ ను పట్టించుకునే వారు లేక శిథిలావస్థకు చేరుకుంది కుల మతాలకు అతీతంగా ఫరీద్ మహల్ లో హిందువు లు ముస్లిం లు ఉర్సు మొహరం పండుగ లను జరుపు కుంటారు. ప్రస్తుతం ఈ ఫరీదా మహల్ కు సంబంధించి హిందువులు శ్రద్ధ చూపడం విశేషం. ఫరీదా మహల్ కు వచ్చిన వారు వారి సమాధుల కు మొక్కినట్లు అయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని కోరికలు ఖచ్చితం గా తీరతాయని గ్రామస్తులు గట్టి నమ్మకం. కామారెడ్డి జిల్లా తో పాటు ఇతర జిల్లాల నుండి పర్యాటకులు ఫరీదా మహల్ కు వచ్చి ఇక్కడ గడిపి బోజనాలు చేసి వెళ్లిపోతారు. మినీ తాజ్ మహల్ గా పిలవబడే పరిధి మహలును ప్రభుత్వం పట్టించుకోని పర్యాటక కేంద్రం గా మార్చా లని గ్రామస్తులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: