మనిషి పుట్టుక నుంచి మరణం వరకు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలా ఒకటేమిటి సగటు మనషికి నిత్యం ఏ సర్టిఫికేట్ కావాలన్న,ఏ సమాచారం కావాలన్నా మనకి ముందుగా గుర్తోచ్చేది 'మీ సేవా ' నే.కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇకపై మీ సేవా లు కనమరుగవ్వనున్నాయట. ఎంతోమంది వారి ఉపాధిని కోల్పోబోతున్నారని అని సమాచారం వెల్లడైయ్యింది. వివరాళ్లో కి వెళ్తే దాదాపు పదిహేనేళ్ల నుంచి ప్రజలకు అన్ని రకాల సేవలను అందిస్తున్న మీ సేవకు కొత్త ప్రభుత్వం మంగళం పాడనుంది.


దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వు లు వెలువడకపోయినా మీ సేవ నిర్వాహకు లు మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. మీసేవ కు మంగళం పాడి కొత్త గా ఏర్పాటు చేయనున్న గ్రామ వార్డు సచివాలయాల్లోని పౌర సేవలు అందించా లని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్ తోంది. ఈ మేరకు మీ సేవ నిర్వాహకులకు కొంత మేర సమాచారం రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



ప్రజలకు విశేష సేవలు అందిస్తూ వస్తున్నాం మీసేవా ఇక రద్దు చేసేందు కు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే అక్టోబర్ రెండో తేదీ నుంచి గ్రామ సచివాలయాలు పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక అన్ని సేవలను ఆ సచివాలయం నుంచే అందించా లని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక మీ సేవా కేంద్రా లను మూసి వేయాల ని నిశ్చయించినట్లు సమాచారం. రెండు వేల మూడు లో మీ సేవ వ్యవస్థ ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తం గా తొమ్మిది వేలు. జిల్లా వ్యాప్తంగా ఆరు వందల ఇరవై రెండు మీ సేవా కేంద్రా లు ఉన్నాయి. గుంటూరు పట్టణం లోని డెబ్బై రెండు మీ సేవా కేంద్రాలు ఉన్నాయి ఇవి కాకుండా ఎనభై నాలుగు ఆన్ లైన్ కేంద్రాలు ఉన్నాయి.


నగరం జిల్లా లో నిర్వహిస్తున్న మీ సేవా కేంద్రాలపై సుమారు అయిదు వేల మంది పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మీ సేవా కేంద్రా లు ఫ్రాంచైజీ పద్ధతి లో నడుస్తున్నాయి సేవలు అందించినందుకు వసూలు చేసే రుసుము లో కొంత శాతం ఫ్రాంచైజీ లకు చెల్లిస్తున్నారు. నిరుద్యోగు లు స్వయం ఉపాధి పొందేందు కు ఇవి తోడ్పడ్డాయి .వచ్చే అక్టోబర్ రెండో తేదీ నుంచి గ్రామ సచివాలయాలు పట్టణాల్లో వార్డు సచివాలయాల ను ఏర్పాటు చేస్తున్నారు.


ఇంకా అన్ని సేవలను ఆ సచివాలయం నుంచే అందించా లని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తమ ఉపాధి ఎక్కడ దూరమవుతుందో నని వీరంతా ఆందోళన చెందుతున్నారు.మన జగన్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో,అవి ఏ పరిణామాలకి దారి తీయనుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: