జగన్మోహన్ రెడ్డి అంత పని చేస్తారని కలెక్టర్లు, జిల్లాల్లోని అధికారులు ఏమాత్రం ఊహించలేదు. ’స్పందన’ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చాలామంది అధికారులు గతంలో చంద్రబాబునాయుడు హయాంలో అమలైన గ్రీవెన్స్ డే లాగే ఇది కూడా నడుస్తుందని అనుకున్నారు. కానీ జగన్ రివర్సులో మాట్లాడేటప్పటికి వాళ్ళకి చెమటలు పట్టేశాయి.

 

ఇక్కడే యంత్రాంగం తప్పులో కాలేసింది. అప్పటి గ్రీవెన్స్ డే సందర్భంగా వచ్చే అర్జీలు 90 శాతం పరిష్కారమైపోయాయని చెప్పేవారు. దాంతో ప్రభుత్వ పనితీరుపై జనాల్లో 90 శాతం సంతృప్తస్ధాయి ఉందంటూ చెప్పేవారు. సరే చంద్రబాబు పాలనపై జనాల్లో ఏ స్ధాయి సంతృప్తు ఉందో మొన్నటి ఎన్నికల్లో స్పష్టమైపోయింది.

 

అధికారులు ఏదో చెప్పేవారు. దాన్నే చంద్రబాబు కూడా తిప్పి తిప్పి ఊదరగొట్టేవారు. జగన్ జమానాలో కూడా అలాగే చేస్తే సరిపోతుందని యంత్రాంగం అనుకుంది. కానీ జగన్ ముందు వాళ్ళ ఆటలు సాగలేదు. అధికారులు చెప్పే లెక్కలను జగన్ తన యంత్రాంగం ద్వారా సొంతంగా సర్వే చేయించారు. దాంతో ప్రతీ జిల్లాలోను స్పందనలోని సమస్యల పరిష్కారాలపై జనాల్లో అసంతృప్తితో ఉన్నట్లు తెలిసిపోయింది.

 

జనాల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేస్తున్నామని కాబట్టి జనాల్లో సంతృప్తి పెరుగుతోందని కలెక్టర్లు, అధికారులు చెప్పారు. దాంతో వెంటనే జగన్ అందరికీ తలంటు పోశారు. స్పందన కార్యక్రమంపై జనాల్లో సంతృప్తిని, సమస్యల పరిష్కారంపై తాను విడిగా సర్వే చేయించినట్లు చెప్పారు. దాంతో అందరికీ చెమటలు పట్టాయి. అందులోను తూర్పు గోదావరి జిల్లాలోని జనాల్లో సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కువ అసంతృప్తిగా ఉన్నట్లు తేలిందని చెప్పటంతో కలెక్టర్లకు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. వీడియో కాన్ఫరెన్సులో ఏదో ఓ లెక్క చెప్పటం కాదని నిజంగా సమస్యల పరిష్కారంపై యంత్రాగమంతా దృష్టి పెట్టాలని ఫుల్లుగా క్లాసు పీకారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: