ఆగస్టు 18 వ తేదీన తెలంగాణాలో చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి.  మార్పులు అంటే జమ్మూ కాశ్మీర్ లో లాగ జరిగే మార్పులు కాదు.  ఈ మార్పులు వేరు.  దేశంలో బీజేపీ పట్టు సాధించింది.  జమ్మూ కాశ్మీర్ విషయంలో నిర్ణయాలు తీసుకోవడంతో మోడీ మీద, బీజేపీపైనా ప్రజల్లో బలమైన నమ్మకం ఏర్పడింది.  ఈ నమ్మకంతోనే ప్రజలు మోడీ వైపు చూస్తున్నారు.  దీంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా బీజేపీలో జాయిన్ కావడానికి ఆసక్తి చూపుతున్నారు.  



ఇప్పుడు తెలంగాణా విషయంలో కూడా అదే జరుగుతున్నది.  తెలంగాణలో చాలామంది నేతలు బీజేపీలో జాయిన్ కావాలని చూస్తున్నారు.  ఇప్పటికే కొంతమంది పార్టీలో చేరారు.  కొంతమంది సిద్ధంగా ఉన్నారు.  ముఖ్యంగా తెలంగాణా తెలుగుదేశం పార్టీ నుంచి ఈ వలసలు ఎక్కువగా ఉంటున్నాయి.  అలానే కాంగ్రెస్ నుంచి కూడా వలసలు ఉంటున్నాయి.  



మరోవైపు తెరాస పార్టీ నుంచి కూడా కొంతమంది పార్టీ మారే ఉద్దేశ్యంతో ఉన్నా వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నారు.  వచ్చే ఎన్నికల నాటికి బలంగా మారాలని చూస్తోంది పార్టీ. అందుకే అవసరమైన మేరకు బలపడేందుకు అన్ని సిద్ధం చేసుకుంటోంది.  ఇప్పటికే దీనిపై పార్టీ గట్టి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  పార్టీలో చేరే వాళ్ళ లిస్ట్ ను తయారు చేస్తోంది.  



కాగా ఈనెల 18 వ తేదీన రాష్ట్రానికి బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి జెపి నడ్డా వస్తున్నారు.  ఆయన సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కలిపి దాదాపు 20 వేలమంది పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.  దీనికోసం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సభను ఏర్పాటు చేస్తున్నారు.  అక్కడ జరిగే మీటింగ్ లో 20 వేలమంది జాయిన్ అవుతున్నారట.  ఇది పార్టీకి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: