ఏపీ సీఎం వైస్ జగన్ ప్రజా సంక్షేమ పధకాలను ప్రతి ఇంటికి చేరేందుకు ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ పేరుతో ఎవరు చేయని విధంగా జగన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల 2 లక్షల 66 వేల మంది ఎంపికయ్యారు. వారందరూ ఈ రోజు నుంచి విధులకు సంబంధించి ట్రైనింగ్ జరుగుతుంది. ఇక గ్రామ సచివాలయాలకు కూడా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఇంత రికార్డు స్థాయిలో ఏ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోవటంతో మొదటి సారిగా ఇప్పుడు ఇవ్వటంతో ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.


జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆంధ్రప్రదేశ్ యువత కోసం గ్రామ సచివాలయాలును ఏర్పాటు చేస్తూ, ఎప్పుడు ఏ రాష్ట్రం భర్తీ చేయనివిధంగా సుమారు లక్షగా పైగా జాబులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నిజానికి ఇంతకు ముందు ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చిన ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయలేదని చెప్పాలి. టీడీపీ హయాం ఉన్నప్పుడు రిలీజ్ చేసిన ఉద్యోగాలను వేళ్ళ మీద లెక్కించుకోవచ్చు. అది కూడా ఎన్నికలకు ముందు అరకొర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నది. 


అయితే జగన్ సుమారు 1500 మంది గ్రామ వాలంటీర్ల తో ముఖా ముఖిలో పాల్గొనబోతున్నాడు. గ్రామ వాలంటీర్లు కు విధులకు సంబంధించి దిశా నిర్దేశం చేయనున్నారు. అయితే గ్రామ వాలంటీర్ల ప్రతి ఇంటికి వెళ్లి ఒక సమగ్ర సర్వే చేయాల్సి ఉంటుంది. ఆ సర్వేన్నీ కంప్యూటర్లో క్రోడీకరించి వాటి మీద జగన్ సమగ్ర పరిశీలన చేసి .. ప్రభుత్వ పధకాలు ప్రజలకు సరిగ్గా అందుతున్నాయా .. లేదా అని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. దీనితో కుల, మత , పార్టీలతో సంభందం లేకుండా ప్రతి ఒక్కరికి పధకాలు అందేలా జగన్ భావించిన విధంగా కార్య చరణ సిద్ధం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: