జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో జాబుల విప్లవం మొదలైందని చెప్పాలి. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి సుమారు 2 లక్షల 67 వేల ఉద్యోగాలు గ్రామీణ యువతకు అవకాశాలు కల్పించారు. ఇవే గాక ప్రభుత్వ ఉద్యోగాలు అయిన గ్రామ సచివాలయాలు సుమారు లక్షకు పైగా ఉద్యోగాలు వదిలి ఔరా అనిపించారు. తన మ్యానిఫెస్టో లో చెప్పిన విధంగా జాబులకు నోటిఫికేషన్ ఇచ్చి త్వర త్వరగా రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పటికే గ్రామ సచివాలయాలు సుమారు 22 లక్షల మంది అప్లై చేశారు. ఇంత రికార్డు స్థాయిలో ఏ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోవటంతో మొదటి సారిగా ఇప్పుడు ఇవ్వటంతో ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.


జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆంధ్రప్రదేశ్ యువత కోసం గ్రామ సచివాలయాలును ఏర్పాటు చేస్తూ, ఎప్పుడు ఏ రాష్ట్రం భర్తీ చేయనివిధంగా సుమారు లక్షగా పైగా జాబులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నిజానికి ఇంతకు ముందు ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చిన ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయలేదని చెప్పాలి. టీడీపీ హయాం ఉన్నప్పుడు రిలీజ్ చేసిన ఉద్యోగాలను వేళ్ళ మీద లెక్కించుకోవచ్చు. అది కూడా ఎన్నికలకు ముందు అరకొర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు లేక గ్రామీణ యువత చాలా ఇబ్బందులు పడింది. 


అయితే జగన్  ఈ రోజు సంచలన ప్రకటన ను అనౌన్స్ చేశారు. ఇంకా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలో ఇస్తామని పేర్కొన్నారు. దీనితో యువత ఆనందంలో మునిగి పోయింది. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా ఉన్న ప్రభుత్వ ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. దీనితో ప్రభుత్వ ఖాళీలు చాలా పెరిగిపోయాయి. జగన్ ప్రకటన ఇప్పుడు మరో సంచలనమంటే అతిశయెక్తి కాదు. జగన్ ఏది ఊరికే చెప్పే రకం కాదు కాబట్టి యువత ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: