నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ పేరు వింటే చాలు ఇటు ప్రతి పక్ష పార్టీలకు .. పాకిస్థాన్ కు ఎక్కడ లేని దడ అని చెప్పాలి. కాశ్మీర్ విషయంలో ఎవరు తీసుకోని నిర్ణయం తీసుకోని పాక్ కు చుక్కలు చూపించారు. కాశ్మీర్ విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకోవాలో తెలియక ప్రతి పక్ష పార్టీలు గిల గిల్ కొట్టుకున్నాయి. మోడీ తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదో ఒక సంచలన నిర్ణయాలు తీసుకోవటం మనం చూస్తున్నాము. రెండు సార్లు అధికారంలోకి పూర్తి మెజారిటీతో రావటం .. ప్రతి పక్షాలు మోడీ దెబ్బకు కుదేలు అవ్వటం ఇవన్నీ మోడీకి కలిసి రావటంతో పెను సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. 


నరేంద్ర మోడీ .. ఇండియాకు ప్రధాన మంత్రిగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ రెండో సారి కూడా భారీ మెజారిటీతో అధికారంలోకి రావటం ఒక్క మోడీకే దక్కింది. మోడీకి ముందు పరిపాలించిన కాంగ్రెస్ ..  సంపూర్ణ మెజారిటీని దక్కించుకోలేకపోయింది. సంకీర్ణ ప్రభుత్వాలతో దేశాన్ని పరిపాలించింది. అయితే మోడీ బంపర్ మెజారిటీతో అధికారంలో రావటంతో నోట్ల రద్దు, జీఎస్టి వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.


ఇప్పుడు రెండో సారి ఇంకా భారీ మెజారిటీతో రావటంతో కాశ్మీర్ విషయంలో ఎవరు తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక్క నిర్ణయం చాలు మోడీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో.. దేశం కోసం ధైర్యంగా ఎలా నిర్ణయం తీసుకుంటున్నాడో ! నిజానికి మోడీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదుల విషయంలో దూకుడుగా ఉంటూ, ఎటువంటి చర్యకైనా సిద్దపడుతున్నారు. అయితే ఇప్పుడు మోడీ ..  ఒకే దేశం .. ఒకే ఎన్నికలు పై కసరత్తు మొదలుపెట్టిందని ..  అమలు చేయడమే తరువాయి అని మోడీ స్పీచ్ చూస్తుంటే తెలుస్తుంది. మోడీ తన స్పీచ్ ఓ పదే పదే ఒక దేశం  ఒకే ఎన్నికలు గురించి చెప్పడంతో సహజంగానే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు దడ పుడుతుంది. ఐదేళ్లు పూర్తిగా కాకముందే కొన్ని రాష్ట్రాలు అధికారం కోల్పోవాల్సి వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: