తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసింది కేంద్రం పథక రచన  చేస్తోందా ? అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఏడాది  నవంబర్ నాటికి చంద్రబాబు పై వివిధ రకాలైన కేసులు నమోదు చేసేందుకు సిబిఐ  రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు పై ఎటువంటి కేసులు నమోదు చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ,  కేసులు నమోదు చేయడం అన్నది మాత్రం ఖాయమేనని హస్తిన వర్గాలు కూడా అంటున్నాయి .  ఈ విషయాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబు కూడా ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ పట్ల  ప్రదర్శించిన దూకుడును,  ఇప్పుడు ప్రదర్శించడం లేదని గుర్తు చేస్తున్నారు .


 జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దు  అంశం లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపడం ద్వారా  చంద్రబాబు, మోడీ కి పరోక్షంగా స్నేహాస్తాన్ని అందించే ప్రయత్నం చేశారని అంటున్నారు .  సార్వత్రిక  ఎన్నికల ముందు  జాతీయస్థాయిలో  విపక్షాల తో జట్టు కట్టి  మోడీ ని ఢీ కొట్టాలని చంద్రబాబు ప్రయత్నించిన విషయం తెల్సిందే. ఎన్నికల్లో మోడీ గతం లో కంటే అత్యధిక స్థానాలతో అధికారం చేపట్టడం తో  చంద్రబాబు ఎన్నికల అనంతరం రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.   జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిప్రత్తి ఆర్టికల్ 370 రద్దును మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా వ్యతిరేకిస్తూ , ఆందోళన కి దిగిన చంద్రబాబు ఆయనకు మద్దతుగా గొంతు కలిపే ప్రయత్నాన్ని చేయలేదు .


 మోడీని ప్రస్తుత పరిస్థితుల్లో ఢీ కొట్టడం అంత ఆషామాషీ కాదని నిర్ణయించుకున్న చంద్రబాబు , ప్రస్తుతానికి రాజకీయంగా మౌనంగా ఉండడమే బెటరన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది . అయితే బాబు మౌనాన్ని మోడీ ఎలా అర్ధం చేసుకుంటారన్న దానిపైనే ఆయనపై సిబిఐ కేసులు ఉంటాయా ? లేదా ?? అన్నది ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: