ఆర్టికల్ 370 రద్దు తరువాత రెండు దేశాల మద్ద్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది.  రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిట ప్రాంతంగా మార్చిన తరువాత పాక్ కుట్రలు చేయడం మరింతగా పెరిగింది.  అవకాశం కోసం ఎదురుచూస్తున్న పాక్, మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్పి కాల్పులకు తెగబడింది. 


రాజౌరి సెక్టార్ వెంబడి కాల్పులకు తెగబడింది.  పాక్ ప్రదర్శించిన అత్యుత్సాహాన్ని ఇండియా ధీటుగా సమాధానం ఇచ్చింది.  ఇండియా ఎదురు కాల్పులు జరపడంతో.. పాక్ కు చెందిన ముగ్గురు సైనికులు మరణించారు.  అయితే, పాక్ మాత్రం దీనిని మరో విధంగా చెప్తున్నది.  పాక్ జరిపిన కాల్పుల్లో పాక్ సైనికులతో పాటు ఇండియాకు చెందిన ఐదుగురు సైనికులు కూడా మరణించారని అంటోంది.  


పాక్ చేసిన వాదనను ఇండియా తిరస్కరించింది.  ఇండియా సైనికుల ఎవరు మరణించలేదని, పాక్ సైనికులు ముగ్గురు మరణించారని స్పష్టం చేసింది.  ఇండియాలో అల్లర్లు సృష్టించేందుకు పాక్ చేస్తున్న ఎత్తుగడలను సమర్ధవంతంగా తిప్పికోట్టింది ఇండియా.  ఇప్పటికైనా బుద్దితెచ్చుకోవాలని లేదంటే భవిష్యత్తులో పాక్ ఇబ్బందులు పడుతుందని హెచ్చరించింది.  


కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తన వైఖరి మార్చుకుంటే మంచిదని ఇండియా హెచ్చరించింది.  కాశ్మీర్ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఇండియా పనిచేస్తుందని ఇండియా స్పష్టం చేసింది.   ఇదిలా ఉంటె, ఆర్టికల్ 370 రద్దు తరువాత జరిగిన తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాబట్టి వీటిని అంగరంగ వైభవంగా నిర్వహించింది.  కాశ్మీర్లో శాంతియుత వాతావరణంలో ఈ వేడుకలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ సింగ్ జెండాను ఎగరవేశారు. 

రాజకీయ నాయకులను కాశ్మీర్లోకి అడుగుపెట్టలేదని, రాజకీయ నాయకులు ఎవరూ కూడా జమ్మూ కాశ్మీర్ లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.  షేర్ ఇ కాశ్మీర్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ  వేడుకల్లో అయన పాల్గొన్నారు.  ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టుగా అయనచెప్పారు .  


మరింత సమాచారం తెలుసుకోండి: