తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వెనక్కి నెట్టి, ప్రజాధారణ లో  ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు వరుస లో నిలిచారు . దేశ్ కా మూడ్ పేరిట విడిపి అసోసియేట్ నిర్వహించిన ఒక సర్వే జగన్మోహన్ రెడ్డి దేశం లోనే మూడవ బెస్ట్ సీఎం గా నిలిచారు . దేశం లో నవీన్ పట్నాయక్ అత్యధికంగా 81  పాయింట్లు సాధించి  ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 72 పాయింట్లతో ద్వితీయ స్థానం లో నిలవగా, 71 పాయింట్లతో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తృతీయ స్థానం లో నిలిచారు .


 హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ 68 , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 65 పాయింట్లతో నాలుగు , ఐదు స్థానాల్లో నిలిచారు . ఈ సర్వే లో మొత్తం 11 , 252 మంది పాల్గొన్నట్లు , వారిలో 10 , 098 మంది ఓటర్లు ఉన్నట్లు విడిపి అసోసియేట్ తెలిపింది . దేశ్ కా మూడ్ సర్వే ఈ నెల 9 నుంచి 14  వరకు 14 రాష్ట్రాల్లో  నిర్వహించినట్లు వెల్లడించింది . దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడవ బెస్ట్ సీఎం గా నిలవడం వెనుక ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలే కారణమని తెలుస్తోంది.


 మే 30 న ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల అమలు దిశగా జగన్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు . దాంతో దేశ వ్యాప్తంగా జగన్ ప్రజాకర్షణ కలిగిన ముఖ్యమంత్రుల్లో మూడవ స్థానంలో నిలిచి ఉంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: