కాశ్మీర్ కు ఉన్న ఆర్టికల్ 370 ను రద్దు చేయడంతో పాకిస్థాన్ .. భారత్ మీద విషం కక్కుతూ వ్యాఖ్యలు చేస్తుంది. మరో పక్క బోర్డర్ వద్ద కవ్వింపు చర్యలకు దిగుతూ భారత్ ను రెచ్చగొడుతుంది. ఇన్ని రోజులు కాశ్మీర్ .. కాశ్మీర్ అని అరిచి గోల చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అది భారత్ లో పూర్తిగా అంతర్భాగం అయిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. భారత్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని అక్కడి సైన్యం కూడా ఎదురు చూస్తుంది. పాక్ యుద్ధం చేయాలనుకుంటుందో ఏమో గాని ఇప్పటీకే లడఖ్ ప్రాంతంలోకి యుద్ధ విమానాలును దింపింది. 


అయితే పాక్ - భారత్ బోర్డర్ లో పాకిస్థాన్ సైనికులు ముగ్గురు చనిపోయినట్టు ఇప్పటికే భారత్ ప్రకటించిన సంగతీ తెలిసిందే. అయితే పాకిస్తాన్ కూడా ఆరుగురు భారత్ సైనికులు చనిపోయారు అని పాక్ వర్గాలు చెప్పడం గమనార్హం. అయితే ఇవన్నీ చూస్తుంటే భారత్  పాక్ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుందని చెప్పొచ్చు. ఇప్పటికే పాక్ అధ్యక్షుడు భారత్ మీద జిహాదీ ప్రకటించాలని విషపూరిత వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే. 


అయితే ఇప్పటికే పాక్ లడఖ్ సరిహద్దు వద్ద యుద్ధ విమానాలను దించింది. అత్యంత శక్తివంతమైన f 16 యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దించింది. దీనితో భారత్ సైన్యం కూడా అలెర్ట్ అయ్యింది. పాక్ ఎటువంటి దుస్సాహస చర్య తీసుకున్న వెంటనే పాక్ భూభాగంలోకి దిగి పోద్ది. బాంబులతో విరుచుకుపడి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కూడా భారత్ లోకి కలిపేసుకోవటానికి కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో భారత్ లేదు. ఇప్పటికే ప్రపంచ దేశాలు పాక్ ను హెచ్చరించాయి. దూకుడుగా వెళ్లొద్దు.. ఏ మాత్రం తేడా వచ్చినా ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియా మిమ్మల్ని వదిలి పెట్టదని అన్నీ దేశాలు హెచ్చరించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: