ఎర్రకోట సాక్షిగా నరేంద్ర మోడీ ఒకే దేశం  ఒకే ఎన్నికలు గురించి చెప్పుక్కుకొచ్చారు. మోడీ మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఆ దిశగా పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి 2022 లో ఆగష్టు నాటికీ ఎన్నికలు జరిపిన ఆశ్చర్యం లేదని తెలుస్తుంది. బీజేపీ .. సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కాంగ్రెస్ సర్కార్ కు బీజేపీకి అదే ప్రధాన తేడా. దేశంలో సంచలన నిర్ణయాలు తీసుకోని .. ఇతర పార్టీలను ఒప్పించే సత్తా కాంగ్రెస్ కు లేదు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయమైన ధైర్యంగా తీసుకుని ముందుకు పోతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నో సంచలన నిర్ణయాలతో దేశంలో ఎన్నో సంస్కరణలు చేపట్టినారు. 


నరేంద్ర మోడీ .. ఇండియాకు ప్రధాన మంత్రిగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ రెండో సారి కూడా భారీ మెజారిటీతో అధికారంలోకి రావటం ఒక్క మోడీకే దక్కింది. మోడీకి ముందు పరిపాలించిన కాంగ్రెస్ ..  సంపూర్ణ మెజారిటీని దక్కించుకోలేకపోయింది. సంకీర్ణ ప్రభుత్వాలతో దేశాన్ని పరిపాలించింది. అయితే మోడీ బంపర్ మెజారిటీతో అధికారంలో రావటంతో నోట్ల రద్దు, జీఎస్టి వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.


ఇప్పుడు రెండో సారి ఇంకా భారీ మెజారిటీతో రావటంతో కాశ్మీర్ విషయంలో ఎవరు తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక్క నిర్ణయం చాలు మోడీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో.. దేశం కోసం ధైర్యంగా ఎలా నిర్ణయం తీసుకుంటున్నాడో ! నిజానికి మోడీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదుల విషయంలో దూకుడుగా ఉంటూ, ఎటువంటి చర్యకైనా సిద్దపడుతున్నారు. అయితే ఇప్పుడు మోడీ ..  ఒకే దేశం .. ఒకే ఎన్నికలు పై కసరత్తు మొదలుపెట్టిందని ..  అమలు చేయడమే తరువాయి అని మోడీ స్పీచ్ చూస్తుంటే తెలుస్తుంది. మోడీ తన స్పీచ్ ఓ పదే పదే ఒక దేశం — ఒకే ఎన్నికలు గురించి చెప్పడంతో ఒకే దేశం  ఒకే ఎన్నికలు ఖాయంగా కనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: