డేరా బాబా గుర్తున్నాడా?రెండు రేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు, ఓ జర్నలిస్టు హత్య కేసులో దోషిగా తేలిన ఈ బాబాబ‌కు 2017 ఆగస్టులో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డేరాబాబా ప్రస్తుతం రోహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సునరియా జైల్లో ఉన్నారు. ఆయ‌నపై కేసు న‌మోదు స‌మ‌యంలో పెద్ద ఎత్తున విధ్వంసం జ‌రిగిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఎంద‌రో పోలీసు అధికారులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు ఆయ‌న వ‌ల్ ఇబ్బంద‌లు పాల‌య్యారు. తాజాగా మ‌ళ్లీ అదే త‌ర‌హా స‌మ‌స్య‌లు ఇంకో రూపంలో ఎదుర‌వుతున్నాయి.


జీవిత ఖైదు అనుభవిస్తున్న డేరా బాబా వల్ల త‌మ‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ఇటు జైలు వ‌ర్గాలు అటు పోస్టు అధికారులు వాపోతున్నాయి. జైలు వాళ్లంటే ఓకే కానీ...పోస్ట‌ల్ శాఖ‌కు ఇబ్బంది ఏంటని అనుకుంటున్నారా? అక్కంటే ఉంది అస‌లు ట్విస్ట్. ఈసారి డేరా బాబా పుట్టినరోజు రాఖీ పండుగరోజు రావడంతో ఆయన ఫాలోవర్లు రాఖీలు, బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డే కార్డులు పంపిస్తున్నారు. దీంతో  రోహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టాఫీసుకు ఆయన పేరుపై ఇప్పటివరకు 7 వేల నుంచి 8 వేల పోస్టు కార్డులు వ‌చ్చాయి. ఆగస్టు 20 వరకు రోజుకు రెండు వేల వరకు రావొచ్చని పోస్టుమాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు.‘పోస్టు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వివరాలను డేటాబేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంటుంది కాబట్టి వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగింది. ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తోంది’ అని చెప్పారు. 


మ‌రోవైపు రోహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టాఫీసు సిబ్బంది వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగి ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లే....డేరాబాబా వల్ల జైలు సిబ్బందీ ఇబ్బంది పడుతున్నారు. అతనికి వచ్చే ప్రతి పోస్టును వాళ్లు క్షుణ్నంగా పరిశీలించాల్సి వస్తోంది. వేలాది పోస్టులు వస్తుండటంతో మూములు టైం కన్నా ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మైన పోస్టు కార్డులేవీ తాము గుర్తించ‌లేద‌ని పోస్టు, జైలు అధికారులు తెలిపారు.


ఇదిలాఉండ‌గా, గ‌త వారం డేరాబాబాకు బెయిల్ మిస్స‌యిన సంగ‌తి తెలిసిందే. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని మూడు వారాలపాటు బెయిల్ ఇవ్వాల్సిందిగా డేరాబాబా  జైలు అధికారులను కోరారు. డేరాబాబా తల్లి నసీబ్‌కౌర్ కూడ( 83) గుండె ఆపరేషన్ ఉన్నందున బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన భార్య హర్జిత్‌కౌర్ పంజాబ్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.అయితే డేరాబాబాకు బెయిల్ ఇచ్చే అంశంలో జైలు అధికారులకే విచక్షణాధికారాలను కోర్టు ఇచ్చిన నేప‌థ్యంలో...వారు ఈ అభ్యర్థనను తిరస్కరించారు. డేరాబాబా బయటకు వస్తే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలున్నందున బెయిల్ నిరాకరించినట్టుగా స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: