జగన్ అధికారంలోకి రాకముందు ఆయన్ను అందరు విమర్శించారు.  జగన్ నియంతగా వ్యవహరిస్తారని.. జగన్ కు అధికార దాహం ఎక్కువ అని విమర్శించారు.  ఈ విమర్శలకు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చెక్ పెట్టాడు.  తాను ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉంటాడో జగన్ చేసి చూపించాడు.  ఇచ్చిన హామీల విషయంలో కూడా కట్టుబడి ఉన్నాడు.  చెప్పినట్టుగా ఉద్యోగాలను కల్పిస్తున్నాడు.  4 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నట్టు చెప్పిన జగన్ ఇప్పటికే 2.50 లక్షల గ్రామ వలంటీర్ల ఉద్యోగాలను కల్పించి శభాష్ అనిపించుకున్నారు.  



స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  జరిగిన ఓ కార్యక్రమంలో జగన్ చేసిన పనిని చూసి అందరు ఫిదా అయ్యారు.  ఇంతకీ ఆ పని ఏంటో ఇప్పుడు చూద్దాం.  గురువారం 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పథకాలు సీఎం చేతుల మీదుగా వారికి ఇస్తారు. ఈ సందర్భంలో ఓ ఆర్మీ పోలీస్ ఆఫీసర్ మెడల్ ఒకటి కింద పడింది. ఇది గమనించని.. ఆ ఆఫీసర్ కవాతు చేసుకుంటూ.. ముందుకువెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం జగన్ కిందకు వంగి ఆ పతాకాన్ని తీసి అక్కడే ఉన్న అధికారికి అందించాడు.  



ఈ విషయాన్నీ అక్కడే ఉన్న కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఇలా పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ గా మారింది.  శభాష్ జగన్ అని అంతా మెచ్చుకుంటున్నారు.  జగన్ ను వ్యతిరేకించిన వ్యక్తులు కూడా ఇప్పుడు జగన్ ను మెచ్చుకుంటున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  ఇక చాలామంది నాయకులు వైకాపాలోకి రావాలనిచూస్తున్నా .. జగన్ మాత్రం పార్టీలోకిరావాలంటే .. ముందుగా చెప్పినట్టుగా పార్టీకి రాజీనామా చేసి రావాల్సిందే అని స్పష్టం చేశారు.  దీంతో చాలామంది నాయకులు పార్టీలో చేరాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయారు.  ఒకవేళ పార్టీకి, పదవికి రాజీనామా చేసి వెళ్తే తరువాత ఏదైనా తేడాలు వస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నారు.  జగన్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి పట్టువిడుపులు ఉండవని ఇప్పటికే స్పష్టం చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: