ప్రపంచంలో  ఏ విషయం కావాలన్నా గూగుల్ లో వెతకడం షరా మాములే.  అందులో దొరకని అంశం అంటూ ఏది ఉండదు.  అందులో పనిచేసే ఉద్యోగులకు జీతాలు భారీగా ఉంటాయి.  అంతేకాదు వారి ఉద్యోగం కూడా చాలా టఫ్ గా ఉంటుంది.  ఆఫీస్ కు వచ్చి.. పని చేసుకొని పోవాలి తప్పించి మరో విషయం గురించి మాట్లాడకూడదు.  ఇది మొదట్లో ఉండేది.  ఒక్క గూగుల్ మాత్రమే కాదు.. ప్రతి కంపెనీ యాజమాన్యం ఇంచుమించుగా ఇలానే ఉంటుంది.  



అచ్చంగా చెప్పాలి అంటే.. బానిస బ్రతుకులు అని చెప్పాలి.  బానిస బ్రతుకులకు టెక్నాలజీని జోడిస్తే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అని చెప్పొచ్చు.  ఇలాంటి ఉద్యోగులు ఇప్పుడు ధైర్యం చేసి ఓ విషయంలో మూకుమ్మడిగా ఓ పిటిషన్ పై సంతకాలు చేసి బయటకు వచ్చారు.  బహుశా ఇలా చేయడం గూగుల్ లో ఇదే మొదటిసారి.  గూగుల్ లోనే కాదు అసలు టెక్నాలజీ రంగానికి చెందిన ఏ కంపెనీలో ఇలాంటి సంఘటనలు జరగలేదు.  



మానవ హక్కులను ఉల్లంఘిస్తూ.. వలసదారుల విషయంలో అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వందలాది గూగుల్ ఉద్యోగులు నిరసన వెళ్లగక్కారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి పని చేయకూడదని దాదాపు అరువందలకు పైగా గూగుల్ ఉద్యోగులు ఒక ఆన్ లైన్ పిటిషన్ మీద సంతకాలు చేసి.. తాము పని చేస్తున్న కంపెనీ అధికారులకు అందించారు. 



దీంతో గూగుల్ ఆలోచనలో పడింది.  అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి పనిచేయాలా వద్ద అన్నది గూగుల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.  అయితే, ఉద్యోగులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పనిచేయబోమని చెప్పడంతో.. గూగుల్ నిర్ణయం తీసుకోక తప్పదు.  అసలు గూగుల్ సంస్థ ఏ కంపెనీతో కలిసి పనిచేయాలో, ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలో గూగుల్ ఎంప్లాయిస్ నిర్ణయించే స్థాయికి ఎదిగారు అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: