ప్రపంచంలో వేగంగా అభివృద్ధికి చెందుతున్న దేశాల్లో ఇండియా ఒకటి.  అన్ని రంగాల్లో వేగంగా ఎదుగుతున్నది.  ఆర్ధికంగా ఆసియాలో బలమైన దేశంగా ఎదుగుతుండటంతో.. పక్కనే ఉన్న చైనా, పాక్ లు ఇబ్బందులు పడుతున్నాయి.  మరోవైపు సంకేతికంగా కూడా ఇండియా ఎదుగుతున్నది.  ఇక స్పేస్ రంగంలో చెప్పాల్సిన అవసరం లేదు.  స్పేస్ పరంగా ఇప్పటికే ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది.  మామ్ ఉపగ్రహాన్ని మార్స్ మీదకు పంపించింది.  అలానే, చంద్రునిమీదకి చంద్రయాన్ 2 ను ప్రయోగించింది.  



ఇది కూడా విజయవంతం కావడంతో పాకిస్తాన్ మరింత ఇబ్బందులు పడుతున్నది.  ఇండియా అన్ని రంగాల్లో ఎదుగుతుంటే పాకిస్తాన్ మాత్రం ఇంకా ఉగ్రవాదం పేరుతో రోజు రోజుకు దిగజారిపోతున్నదో అర్ధం అవుతున్నది.  అంతేకాదు, రక్షణ రంగంలో కూడా ఇండియా దూసుకుపోతున్నది. కొత్త కొత్త ఆయుధాలు దిగుమతి చేసుకోవడమే కాకుండా.. సొంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటోంది.  



ఇదిలా ఉంటె, ఇప్పుడు మరో ప్రపోజల్ ను ఇండియా రక్షణశాఖ ముందుకు తీసుకొచ్చింది.  ఇప్పటి వరకు దేశంలోని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవి రంగాలకు విడివిడిగా బాసులు ఉన్నారు.  ఏ డెసిషన్ తీసుకోవాలని అనుకున్నా ముగ్గురు కలిసి తీసుకోవాల్సి వచ్చేది.  ఒక్కోసారిసమన్వయ లోపం కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  


అందుకోసమే, మూడింటిని ఒకే గొడుకు కిందకు తీసుకొని ఒకే బాస్ ను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం చూస్తోంది.  ఈ ప్రపోజల్ ఎప్పటినుంచో ఉన్నా, ఇప్పుడు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  త్రివిధ దళాలకు ఒక్కరే బాస్ ఉంటె వారి ఆధ్వర్యంలోనే మూడు  దళాలు నడుస్తాయి.  ఫలితంగా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్నా ఈజీగా తీసుకోవచ్చు.  ఒకవేళ మూడు దళాలకు ఒక్కరే బాస్ ను నియమిస్తే ఎవరి దానికి సమర్థులు అనే దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: