ఏపీలో ఇప్పుడు డ్రోన్ల రాజకీయం ఇప్పుడు టీడీపీ  వైసీపీ పార్టీల మధ్య ఎక్కడ లేని చిచ్చు రేపుతోంది. చంద్రబాబు ఇంటి నివాసం వద్ద డ్రోన్లను మోహరించడంతో నా పై వైసీపీ రాజకీయ కక్ష సాధిస్తుందని చంద్రబాబు ఆగ్రహించారు. అయితే ఇదే విషయం మీద మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ డ్రోన్లను గత మూడు రోజులు నుంచి ప్రభుత్వమే పెట్టిందని .. వరద ముప్పును అంచనా వేయడానికే మాత్రమే ఉపయోగిస్తున్నామని .. కానీ టీడీపీ అనవసర డ్రామాలు ఆడుతుందని అనిల్ కుమారు ఫైర్ అయ్యారు. ఎగువ ప్రాంతంలో భారీ గా వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజి కు మరింత వరద నీరు వచ్చే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రతగా డ్రోన్లతో అంచనా వేస్తున్నామని చెప్పారు. 


 అయితే కృష్ణ నదికి అనుకున్న చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమని మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తుంది. నది పరివాహక ప్రాంతం అయినా లింగమనేని గెస్ట్ హౌస్ చట్ట విరుద్ధమని, సాక్షాత్తు కేంద్ర పర్యావరణ శాఖ కూడా లేఖలో పొందు పరిచింది. అందుకే చంద్రబాబు నివాసానికి అనుకుని ఉన్న ప్రజా వేదికను జగన్ సర్కార్ కూల్చి పడేశారు. అయితే ఇప్పుడు వర్షాలతో, వరదలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతుంది. దీనితో చంద్రబాబు నివాసానికి ముంపు వచ్చింది.


చంద్రబాబు కూడా అక్కడ ఉండలేక హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి. వరదను ఆపడానికి ఇసుక బస్తాలను మోహరించిన పరిస్థితి. అయితే వరద ముప్పుతో ఉన్న చంద్రబాబు ఇల్లును డ్రోన్లతో నిఘాలో పెట్టడమే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పు. సాధారణ ప్రజలను ఎలాగైతే కాపాడాలో.. రాష్ట్ర ప్రతి పక్ష నేత అయిన చంద్రబాబును అలాగే కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వానిది. కానీ దానిని కూడా తప్పు అనే స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులూ. దీనితో ఇప్పుడు ఈ వివాదం తార స్థాయికి చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: