హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన అక్కడ ఇంటి అద్దెలు సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉంటాయి. నగరంలో లోపలి ప్రాంతం అయితే డబుల్ బెడ్ రూమ్ 7 నుంచి 12 వేలు లోపు దొరికేస్తాయి. కొంచెం జాతీయ రహదారులకు దగ్గర ప్రాంతాలు అయితే డబుల్ బెడ్ రూమ్ 10 వేల నుంచి 15 వేల వరకు ఉంటుంది. కానీ నగరంలో ఓ ఏరియాలో మాత్రం ఈ రేట్లలో ఇల్లు అద్దె దొరకవు. సుమారు ఇక్కడ రూ.25 వేలపైనే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అది సినీ, రాజకీయ,వ్యాపార ప్రముఖులు, వీవీఐపీలు ఉండే ప్రాంతం. 


అంత కాస్ట్లీ ఏరియా ఏదో కాదు 'బజారాహిల్స్' దీనికి కొంచెం తక్కువలో జూబ్లీహిల్స్ ఉంది. హైదరాబాద్ నగరంలో ‘అనరాక్‌ ప్రాపర్టీస్‌’ సంస్థ చేపట్టిన ఖరీదైన ప్రాంతాల సర్వేలో బంజారాహిల్స్‌ టాప్‌లో నిలవగా జూబ్లీహిల్స్‌ రెండో స్థానంలో నిలిచింది. నగరంలో బాగా డబ్బున్నవారు నివసించే ఈ రెండు ప్రాంతాలు ఖరీదైన నివాస ప్రాంతాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. గత రికార్డులని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా టాప్ లో నిలిచాయి. ముఖ్యంగా ఇంటి అద్దె విషయంలో కొన్ని దశాబ్దాలుగా టాప్ లో ఉంటూనే వస్తున్నాయి. వీటి తర్వాత హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, బేగంపేట్, కొండాపూర్, నల్లగండ్ల, నార్సింగి, మియాపూర్, ఎల్బీనగర్‌ ప్రాంతాలు టాప్‌ టెన్‌ స్థానాల్లో నిలిచాయి. 


ప్రధానంగా అనరాక్ ప్రాపర్టీస్ సంస్థ ఆయా ప్రాంతాల్లో సరాసరిన 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల అద్దెలను ప్రామాణికంగా తీసుకొని సర్వే చేసింది. ఆయా ప్రాంతాల్లో గతేడాదితో పోలిస్తే ఇంటి అద్దెలు సరాసరి 9 శాతానికి పైగానే పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ టాప్ లో ఉండటానికి ప్రధాన కారణం, ఈ ప్రాంతాల్లో సినీ, రాజకీయ, పారిశ్రామిక, వ్యాపార రంగ ప్రముఖులతో పాటు దేశ, విదేశాలకు చెందిన ముఖ్యులు నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతుండటం. అలాగే ఈ ప్రాంతాల్లో సువిశాల ప్రాంగణాల్లో అత్యాధునిక వసతులున్న భవనాలు అందుబాటులో ఉండటం.


పైగా ఈ ప్రాంతాల్లోనే బ్యాంకింగ్, నాన్‌ బ్యాంకింగ్, ఐటీ, బీపీఓ, కేపీఓ, బీమా, ఫార్మా ఇతర వాణిజ్య, వ్యాపారాలకు సంబంధించిన కార్పొరేట్‌ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇక్కడే నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇళ్ల అద్దె అమాంతం పెరగుతోంది. వీటికి తోడు మల్టీప్లెక్సులు, పబ్స్, షాపింగ్ మాల్స్, బార్లు, అత్యాధునిక సదుపాయాలు గల హాస్పిటల్స్, స్కూల్స్ ఉన్నాయి. వీటితోపాటు చాలా రకాల వసతులు ఉండటం వల్లే బజారాహిల్స్, జూబ్లీహిల్స్ అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: