పేదల పెన్నిధి కి నిధుల బెంగ

పేద ప్రజలకు అనారోగ్యం కలిగినప్పుడు వర ప్రదాయినిగా పని చేస్తోంది ఆరోగ్యశ్రీ పథకం.   ఈ పథకం కింద ప్రతి తెల్ల రేషన్ కార్డు దారుడు తమ కుటుంబంతో సహా లబ్ధి పొంది, పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్య చికిత్సలు ఉచితంగా  చేయించుకో గలుగుతున్నారు. ఇది పేద ప్రజలకు ఎంతో బాసటగా నిలుస్తోంది . దీని ద్వారా వైద్యం చేయించుకున్న ప్రతి తెల్ల కార్డు దార్ల నయాపైసా చెల్లించకుండా  అత్యాధునికమైన వైద్యం చేయించుకోగలరు.

 ఈ అద్భుతమైన  ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న చార్జీలు సరిపోవని దాన్ని ఇంకా పెంచాలని కార్పొరేట్ ఆసుపత్రుల వారు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు.   అయితే ఆ విషయం ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర రావు గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం ఉన్న చార్జీలు తప్పనిసరిగా పెంపుదల చేస్తా మని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ అన్నారు.

ప్రస్తుతం తమకు 1500 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి పడింది కార్పొరేట్ ఆసుపత్రుల వారి వాదన కానీ తాము 600 కోట్లు మాత్రమే బాకీ ఉన్నామని త్వరలో తదనుగుణంగా నగదు విడుదల చేస్తామని శ్రీ ఈటెల రాజేందర్ చెప్పారు.   ప్రభుత్వం పేదల ఆరోగ్య విషయంలో ఎటు వంటి అలసత్వం ప్రదర్శించని, ఎటువంటి రాజీ కూడా పడకుండా పేద ప్రజలకు మంచి ఆరోగ్య సౌకర్యం, చికిత్సా సదుపాయాలు కలిగేలా అన్ని చర్యలు సత్వరమే తీసుకుంటామని శ్రీ ఈటెల రాజేందర్ అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: