బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్ కు ఉన్న ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తరువాత తన నెక్స్ట్ అజెండా ఒకే దేశం  ఒకే ఎన్నికలని సంకేతాలు పంపించింది. ఇప్పటికే ఈ అంశం మీద అన్నీ రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించింది. అయితే మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత తప్పదని చెప్పాలి. ఏ రాష్ట్రం కూడా ముందుగానే అధికారం విడిచిపెట్టి ఎన్నికలకు వెళ్లాలని అనుకోదు. మరి ఇటువంటి విషయాన్ని బీజేపీ ఎలా డీల్ చేయబోతుందో చాలా ఆసక్తికరం. జమ్మూ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రం కాబట్టి పెద్ద సమస్య లేకుండా పోయింది. కానీ ఒకే ఎన్నికల కాన్సెప్ట్ అనేది అన్ని రాష్ట్రాలకు సంబంధించింది. అంత సులభం కాదని చెప్పాలి. 


అయితే మోడీని తక్కువ అంచనా వేయలేము. ఇండియాకు ప్రధాన మంత్రిగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ రెండో సారి కూడా భారీ మెజారిటీతో అధికారంలోకి రావటం ఒక్క మోడీకే దక్కింది. మోడీకి ముందు పరిపాలించిన కాంగ్రెస్ ..  సంపూర్ణ మెజారిటీని దక్కించుకోలేకపోయింది. సంకీర్ణ ప్రభుత్వాలతో దేశాన్ని పరిపాలించింది. అయితే మోడీ బంపర్ మెజారిటీతో అధికారంలో రావటంతో నోట్ల రద్దు, జీఎస్టి వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.


నిజానికి మోడీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదుల విషయంలో దూకుడుగా ఉంటూ, ఎటువంటి చర్యకైనా సిద్దపడుతున్నారు. ఎవరు ఊహించని విధంగా అనుకున్న వెంటనే అమలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మోడీ ..  ఒకే దేశం .. ఒకే ఎన్నికలు పై కసరత్తు మొదలుపెట్టిందని ..  అమలు చేయడమే తరువాయి అని మోడీ స్పీచ్ చూస్తుంటే తెలుస్తుంది. మోడీ తన స్పీచ్ లో పదే పదే ఒక దేశం — ఒకే ఎన్నికలు గురించి చెప్పడంతో ఒకే దేశం — ఒకే ఎన్నికలు ఖాయంగా కనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: