జగన్ అంటే ఉదారంగా ఉంటారని, మాట ఇస్తే తప్పరన్న భావన పార్టీ నాయకుల్లో ఉంది. అది నిజమే కానీ ఎప్పటికీ అలాగే ఉంటే ఇబ్బందులు కూడా వస్తాయి. పార్టీ, ప్రభుత్వం ఇపుడు రెండింటినీ చూసుకోవాల్సిన అతి పెద్ద బాధ్యత జగన్ మీద ఉంది. అందువల్ల గతంలోలా కాకుండా ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటున్నారు.


జగన్  పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. మంత్రి వర్గం భర్తీ అయింది కొన్ని కీలకమైన నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేశారు. ఇక పెద్ద ఎత్తున పదవుల పందేరం ఉంటుందని అంతా భావించారు. అయితే జగన్ ఇపుడు తన ఆలోచనలు మార్చుకున్నారట. నామినేటెడ్ పదవుల పందేరం ఆయన ప్రస్తుతానికి  వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.


పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇవ్వాలన్నది జగన్ విధానంగా పెట్టుకున్నారు. మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వాటిలో కూడా కష్టపడి వైసీపీని గెలిపించే నేతలకు పదవులు ఇవ్వాలన్నది జగన్ సరికొత్త ఆలోచనగా చెబుతున్నారు. అసెంబ్లీ, ఎంపీ సీట్లను బంపర్ మెజారిటీతో గెలుచుకున్న వైసీపీకి లోకల్ బాడీ ఎన్నికలు చాలా కీలకమైనవి.


పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జనాభిప్రాయం ఎలా ఉందన్నది తెలియచెప్పే ఎన్నికలు ఇవి. దాంతో జగన్ గట్టిగానే ద్రుష్టిపెడుతున్నారు. ఇక నామినేటెడ్ పదవులు ఇచ్చేస్తే మిగిలిన వారు అసంత్రుప్తికి లోను అయి పార్టీకి దూరంగా ఉంటారు, దాంతో కొత్త తలనొప్పులు మొదలవుతాయి. అవి ఎన్నికలపై ప్రభావం చూపుతాయని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందువల్ల మొత్తం లోకల్ బాడీస్ ఎన్నికలు పూర్తి అయిన తరువాత తాపీగా అసలైన  అర్హులకు పదవులు కట్టబెట్టాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతో  పదవుల మీద ఆశ పెట్టుకున్న వారికి భారీ షాకే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: