కేంద్ర హోమ్ మినిస్టర్ రాజ్ నాధ్ సింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చెసారు. వాజపేయి మొదటి వర్ధంతి సందర్భంగా రాజ్ నాధ్ ఒక కార్యక్రమంలో పాకిస్తాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. భారత్ అణ్వస్త్ర దేశం అయిన సంగతీ తెలిసిందే. అయితే మన దేశం 'మొదటగా ప్రయోగించకూడదు'  అనే విధానాన్ని ఫాలో  అవుతుంది. మన దేశం మీద వేరే అణ్వస్త్ర దేశం దాడులు చేస్తనే అప్పుడు భారత్ ఆ దేశం మీద న్యూక్లియర్ బాంబులు విసురుతుంది. అయితే రాజ్ నాధ్ మాట్లాడుతూ భారత్ ఇప్పటికే అదే పాలసీ ని ఫాలో అవుతుందని చెబుతూనే భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పలేమని .. అది పరిస్థితులను బట్టి ఆధార పడి ఉంటుందని చెప్పారు. అంటే పరోక్షంగా పాకిస్తాన్ ను హెచ్చరించారు. 


అయితే పాక్ భారత్ బోర్డర్ లో పాకిస్థాన్ సైనికులు ముగ్గురు చనిపోయినట్టు ఇప్పటికే భారత్ ప్రకటించిన సంగతీ తెలిసిందే. అయితే పాకిస్తాన్ కూడా ఆరుగురు భారత్ సైనికులు చనిపోయారు అని పాక్ వర్గాలు చెప్పడం గమనార్హం. అయితే ఇవన్నీ చూస్తుంటే భారత్ — పాక్ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుందని చెప్పొచ్చు. ఇప్పటికే పాక్ అధ్యక్షుడు భారత్ మీద జిహాదీ ప్రకటించాలని విషపూరిత వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే. 


అయితే ఇప్పటికే పాక్ లడఖ్ సరిహద్దు వద్ద యుద్ధ విమానాలను దించింది. అత్యంత శక్తివంతమైన f 16 యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దించింది. దీనితో భారత్ సైన్యం కూడా అలెర్ట్ అయ్యింది. పాక్ ఎటువంటి దుస్సాహస చర్య తీసుకున్న వెంటనే పాక్ భూభాగంలోకి దిగి పోద్ది. బాంబులతో విరుచుకుపడి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కూడా భారత్ లోకి కలిపేసుకోవటానికి కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో భారత్ లేదు. ఇప్పటికే ప్రపంచ దేశాలు పాక్ ను హెచ్చరించాయి. దూకుడుగా వెళ్లొద్దు.. ఏ మాత్రం తేడా వచ్చినా ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియా మిమ్మల్ని వదిలి పెట్టదని అన్నీ దేశాలు హెచ్చరించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: