ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినరు...  తాను ఏది అనుకుంటే అదే చేస్తారు. విద్యుత్ ఒప్పందాలను  సమీక్షించ వద్దని కేంద్రం ఎంత  చెప్పినా…  భే ఖాతర్ చేస్తూ, విద్యుత్ ఒప్పందాలను  సమీక్షించి తీరుతానని మొండి పట్టుదలతో వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక  పోలవరం కాంట్రాక్టు పనులు చేపడుతున్న  నవయుగ నిర్మాణ  కంపెనీ కాంట్రాక్టును  కూడా ఏకపక్షంగా  రద్దు చేసి సంచలనం సృష్టించడమే కాకుండా ... ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుంటే విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో ఎలా వ్యవహరించామో అలాగే వ్యవహరిస్తామని  పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి  చెప్పకనే తన చర్యల ద్వారా చెప్పారు.


దీనితో పోలవరం నిర్మాణ పనుల నుంచి నవయుగ నిర్మాణ కంపెనీ ని తప్పించిన కేంద్రం జోక్యం చేసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు . విద్యుత్ ఒప్పందాలు , పోలవరం నిర్మాణ పనుల విషయం లో కాంట్రాక్టు కంపెనీ పట్ల వ్యవహరించినట్లుగానే జగన్ ,    తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా భేఖాతర్ చేయడం హాట్ టాఫిక్ గా మారింది .  ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (ఏపీ ఏటి) అడ్మినిస్ట్రేటివ్ మెంబర్ గా రిటైర్డ్ ఐ ఏ ఎఫ్ అధికారి మల్లికార్జునరావు  నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జూలై 11న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల  ప్రకారం ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు .  ఇంతవరకు అంత బాగానే ఉన్నప్పటికీ, సీఎం జగన్  ఆగమేఘాల మీద  ఏపీ ఏటిని రద్దు చేయడం సంచలనం సృష్టించింది. 


నిజానికి ఏపీ ఏటిని రద్దు చేయాలంటే రాష్ట్రపతి అనుమతి అవసరం... ఎందుకంటే ఆ ఉత్తర్వులపై  సంతకాలు పెట్టి అనుమతించేది ఆయనే  కాబట్టి . అయితే రాష్ట్రపతి అనుమతి తో సంబంధం లేకుండానే జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఫలితంగా అటు కేంద్రం తోనూ , ఇటు రాష్ట్రపతితోను ముఖ్యమంత్రి కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు కన్పిస్తోందని న్యాయ నిపుణులు అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: