చంద్రబాబు ఇల్లు లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా చంద్రబాబు ట్విట్టర్లో స్పందిస్తూ నా ఇల్లు మీద పెట్టిన శ్రద్ద రాష్ట్ర ప్రజల మీద పెట్టాలని హితవు పలికారు. ఎప్పుడు నా ఇల్లు మునిగిపోద్దా అని మంత్రులు ఎదురు చూస్తున్నారని బాబు చెప్పుకొచ్చారు. వరదలను నియంత్రించడంలో వైసీపీ విఫలమయ్యిందని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ బాబు గారు కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వరదలను నియంత్రించడంలో వైసీపీ విఫలమయ్యిందని చెప్పారు. రాష్ట్రంలో వరదల ప్రాణ నష్ట్రం ఎక్కడ జరగలేదు. గంట గంటకు నీటి మట్టాన్ని అంచనా వేసి గేట్లను వెత్తివేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు.


అయితే కృష్ణ నదికి అనుకున్న చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమని మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తుంది. నది పరివాహక ప్రాంతం అయినా లింగమనేని గెస్ట్ హౌస్ చట్ట విరుద్ధమని, సాక్షాత్తు కేంద్ర పర్యావరణ శాఖ కూడా లేఖలో పొందు పరిచింది. అందుకే చంద్రబాబు నివాసానికి అనుకుని ఉన్న ప్రజా వేదికను జగన్ సర్కార్ కూల్చి పడేశారు. అయితే ఇప్పుడు వర్షాలతో, వరదలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతుంది. దీనితో చంద్రబాబు నివాసానికి ముంపు వచ్చింది.


అయితే చంద్రబాబు తన ఇంటి మీద డ్రోన్లను పెట్టినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన స,సంగతీ తెలిసిందే. మాజీ ఇరిగేషన్ మంత్రి ఉమా మహేశ్వర్ అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి .. ప్రభుత్వం కృతిమంగా వరదను సృష్టించి చంద్రబాబు ఇల్లును మునిగేలా చేసారని చెప్పుకొచ్చారు. అయితే కృతిమంగా వరదను ఎలా  సృష్టిస్టారో ఆయనే చెప్పి ఉంటే బాగుండేది. చంద్రబాబు ఇల్లు కృష్ణ నదిని అనుకునే ఉంది. అలాంటప్పుడు అన్ని లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడు చంద్రబాబు ఇల్లుకు ముంపు సహజం. కానీ టీడీపీ వితండవాదం చేస్తుంది. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలు చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: