రాయపాటి సాంబ శివ రావు టీడీపీ మాజీ ఎంపీ మరియు టీడీపీలో సీనియర్ నేత. అయితే ఇప్పుడు రాయపాటి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రాష్ట్రంలో జగన్ పాలనా బాగుందని .. నవరత్నాలు ప్రజలకు చేరువయితే జగన్ ప్రజా నాయకుడిగా కీర్తించబడతాడని .. జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే నవరత్నాల అమలకు నిధుల కొరత ఉందని .. కేంద్రం సహకరించడం లేదని రాయపాటి చెప్పుకొచ్చారు. అయితే కొన్ని రోజుల నుంచి రాయపాటి పార్టీ మారబోతున్నాడని ఒకటే టాక్ నడుస్తుంది. నిజానికి ఏ టాక్ ఎన్నికల ముందు కూడా వచ్చింది. కానీ ఎందుకో గాని రాయపాటి ఎన్నకలప్పుడు పార్టీ మారలేదు. 


అయితే ఇప్పుడు రాయపాటి వ్యాఖ్యలను చూస్తుంటే .. ఖచ్చితంగా వైసీపీ లోకి చేరడానికి హింట్ ఇస్తున్నాడని అర్ధం అవుతుంది. అయితే బీజేపీ పార్టీలోకి చేరతాడన్న ఊహాగానాలకు తెర పడిందని చెప్పాలి. రాయపాటి మూడ్ చేస్తుంటే వైసీపీ గూటికే చేరేందుకు ఇష్ట పడుతున్నారు. అయితే మొన్న రాయపాటి .. దక్షిణాన మొదట కేసీఆర్ సర్కార్ ను .. తరువాత జగన్ సర్కార్ ను కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందని బాంబు పేల్చారు.


ఇప్పుడు స్పందిస్తూ, బీజేపీ ఏపీలో బలపడటం కష్టమైన వ్యవహారమని చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీలో చేరబోయేది ఇంకా నిర్ణయించుకోలేదని .. త్వరలోనే ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకొని చెబుతానని చెప్పారు. అయితే రాయపాటికి ఎన్నికల ముందు టీడీపీలో నరసారావు పేట పార్లమెంట్ విషయంలో చంద్రబాబు హామీ ఇవ్వలేదు. తరువాత బాబుతో భేటీ అయ్యి, ఆ సీటును దక్కించుకున్నారు. అయితే రాయపాటి ఆ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీనితో టీడీపీలో రాయపాటి రాజకీయ జీవితంకు శుభం కార్డు పడుతుందేమోనని రాయపాటి బాగా ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: