ఐక్యరాజ్య సమితి కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సూచించడానికి అప్పుడెప్పుడో అంటే 1948 వ సంవత్సరంలోనే కొన్ని ప్రతిపాదనలు చేసింది.  మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకు వచ్చింది.  ఫ్లెబిసైట్ ద్వారా పరిష్కారం కనుగొనడానికి సిద్ధం అయ్యింది.  దానికంటే ముందు అక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఐక్యరాజ్య సమితి కొన్ని ప్రతిపాదనలు చేసింది.  ఈ ప్రతిపాదనల ప్రకారం...  


కాశ్మీరేతర పాకిస్థాన్‌ జాతీయులు, గిరిజనులు జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం నుంచి తక్షణం వైదొలగాలి. ఐక్యరాజ్యసమితిని సంతృప్తి పరచాలంటే వారు ఈ పనిచేయక తప్పదు. వారు అక్కడ ఉన్నన్ని రోజులూ ఘర్షణకు ఆస్కారం ఉంటుంది. పాకిస్థానీల దాడుల నుంచి స్వీయరక్షణకు అవసరమైన సైన్యం తప్పితే.. మిగతా బలగాలన్నింటినీ భారతదేశం కూడా ఉపసంహరించాలి. ఎన్ని బలగాల్ని ఉంచాలో  ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన కమిషన్‌ను  సంప్రదించొచ్చు.
ఈ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి భావించినపుడు ప్లెబిసైట్‌ నిర్వహిద్దాం. అయితే స్వతంత్ర కశ్మీర్‌ కోసం కాకుండా.. కశ్మీరీలు పాకిస్థాన్‌ లేదా భారత్‌తో కలిసిఉండడం కోసమే మాత్రమే ఓటేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో తమ భవిష్యత్తును నిర్ణయించుకునే పూర్తిస్వేచ్ఛ కశ్మీరీలకు ఉంటుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పడానికి వారు సహకరించాలి. ఒక దేశం ప్రాదేశిక సమగ్రతకు ముప్పు తేవడం కోసం బలగాల్ని ఉపయోగించడం కాకుండా... కశ్మీర్‌ సమస్యను శాంతియుత పద్ధతుల్లో పరిష్కరించు కోవాలని ఐరాస ఛాప్టర్‌ స్పష్టంగా నిర్దేశిస్తోంది. 


ఆ తరువాత ఇప్పటి వరకు ఫ్లెబిసైట్ జరగలేదు.  పాకిస్తాన్ నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నది.. ఇండియా దానికి ధీటుగా సమాధానం ఇస్తూనే ఉన్నది.  ఇలా రెండు దేశాల మధ్య కాశ్మీర్ సమస్య మొన్నటి వరకు పరిష్కారం కానీ ఒక పెద్ద గుదిబండలా మారిపోయింది.  ఈ ఆగష్టు 5 వ తేదీ తరువాత సమస్యకు పరిష్కారం దొరకడంతో కాశ్మీర్ ఇండియాలో పూర్తిగా అంతర్భాగం అయ్యింది.  ఇప్పుడు ఇండియా కన్ను పాక్ ఆక్రమించుకున్న కాశ్మీర్ పైనా అలానే, బలూచిస్తాన్ స్వాతంత్రం పైనా ఉన్నాయి.  ఈ రెంటింటిని ఇండియా సమర్ధవంతంగా ఆపరేట్ చేస్తే ఆసియాలో ఇండియాకు తిరుగుండదు.  ఇండియా అంటే చుట్టుపక్కన ఉన్న దేశాలు భయపడతాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: