దేశంలో ప్లాస్టిక్ వినియోగం గురించి ఎప్పటి నుంచో కొన్ని విషయాలను అమలు చేయాలని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి.  కొన్ని రోజులు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.  ఆ తరువాత షరా మాములే.  ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్టుగా మారిపోతుంది పరిస్థితి.  అధికారులు ప్లాస్టిక్ వినియోగంపై దాడులు చేసే అవకాశం ఉన్నది అని తెలుసుకోగానే కవర్లు పక్కన పెట్టేస్తారు.. కొన్నిరోజుల తరువాత తిరిగి బయటకు తీస్తారు.  


స్వాతంత్ర పోరాటం కోసం ప్రజలు ఎలాంటి ఉద్యమం చేశారో... అలాంటి ఉద్యమం చేయాలి.  ప్రజల్లో సమూలంగా మార్పులు తీసుకురావాలి.  ప్లాస్టిక్ వినియోగంపై వీలైనంత వరకు అవగాహనా కల్పించాలి.  అవగాహనా కల్పించాలనే మాట బాగున్నా.. ఎప్పటి నుంచో అవగాహన కల్పిస్తున్నా.. అమలు జరగడం లేదు.  ఒక్క ఇంచే కూడా ముందుకు జరగడం లేదు.  మరి వీటి నుంచి బయటపడాలి అంటే ఎలా ఎం చేయాలి.  


ఏదో రెండు మూడు రోజులు అలా కఠినంగా వ్యవహరించి పక్కన పెట్టకుండా.. ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని ప్లాస్టిక్ నిషేధంపై ముందడుగు వేయాలి.  అప్పుడే కొంత మార్పు వస్తుంది.  దీనికోసం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఓ నిర్ణయం తీసుకుంది.  ముందుగా పూలబొకేల విషయంలో దీన్ని అమలు చేయడానికి సిద్ధం అయ్యింది.  బొకేలను తయారు చేయడం కోసం ప్లాస్టిక్ ను వినియోగిస్తారు.  ప్లాస్టిక్ ను వినియోగించడం వలన పర్యావరణానికి హాని కలుగుతుంది.  


అందుకే పూల బొకేలను ప్లాటిక్ తో కాకుండా.. జనపనార పేపర్ తో తయారు చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నారు.  నగరంలో ప్రస్తుతం 500 వరకు పూల బొకేలను విక్రయించే దుకాణాలు ఉన్నాయి.  ముందుగా వీరికి వీటిపై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసి సిద్ధం అయ్యింది.  ప్లాస్టిక్ కాకుండా పేపర్, జనపనార వంటి వాటితో బొకేలను తయారు చేసే వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు జీహెచ్ఎంసి సిద్ధం అయ్యింది.  సో, పర్యావరణానికి మేలు చేస్తే.. అది మీకు మేలు చేస్తుంది.  ప్లాస్టిక్  వినియోగాన్ని వీలైనంత త్వరగా నిషేధించే విధంగా ప్రజల్లో మార్పు తేవాలని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోడీ ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: