పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అంటారు.  డబ్బు సంపాదించాలనే కోరిక ఉండాలి గాని, ఎలాగైనా డబ్బు సంపాదించవచ్చు.  అదేదో సినిమాలో చెప్పినట్టు.. డబ్బు ఎంత సంపాదించావు అని లెక్క చూస్తారుగాని ఆ డబ్బును ఎలా సంపాదించారు అని చూడరు. ఎలా సంపాదించినా ఆ డబ్బుపై ఉండేది ఒకటే బొమ్మ.  అందుకే డబ్బును ప్రేమించు డబ్బును సంపాదించు అని.  కొంతమంది దీనిని విపరీతంగా ఫాలో అవుతుంటారు.  కొందరు మాత్రం 24 గంటలు పనిచేసినా వచ్చే బెత్తెడు సంపాదనతో కాలం వెళ్లదీస్తుంటారు.  


డబ్బు సంపాదించడం ఒకెత్తయితే.. ఆ డబ్బును సృషించడం మరొక ఎత్తు.  ఇటీవలే ప్రధాని మోడీ ఓ మాట చెప్పారు.  సంపదను సృష్టించే వారి పట్ల గౌరవం ఉండాలి అని.  ఇది ముమ్మాటికీ కరెక్ట్.  ఎలాగంటేసంపదను సృష్టించే అవకాశం వారికీ ఇస్తే.. వారు మనకు ఉద్యోగాలు కల్పిస్తారు.  ఫలితంగా నిరుద్యోగం తగ్గిపోతుంది.  ఏదైనా సరే ఉద్యోగం ఉద్యోగమే కదా.  అయితే, కొన్ని ఉద్యోగాలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి.  విచిత్రంగా ఉండటమే కాదు.. ఆనందాన్ని తెచ్చిపెడతుంటాయి.  డబ్బును ఇస్తుంటాయి.  


అలాంటి ఉద్యోగాల్లో ఒకటి.. కౌగిలింత.. అదేంటి అదేం ఉద్యోగం అని షాక్ అవ్వకండి...  అక్కడికే వస్తున్నా..ఇది రోబోటిక్ యుగం.. ఇప్పుడు మనుషులు రోబోల్లా మారిపోయి పనిచేస్తున్నారు.  పనిచేయడమే కాదు.. ఇంటిని మనుషులను.. ఆత్మీయతలు మర్చిపోయి పనిచేస్తున్నారు.  ఆత్మీయ స్పర్శకు దూరం అవుతున్నారు. అలాంటి వారికి ఓ ఆత్మీయ స్పర్శను కలిగిస్తే.. వారు మరింత ఎక్కువగా పనిచేస్తారు.  పనిచేయడం దగ్గరి నుంచి ప్రతి విషయంలోనూ ముందు ఉంటారు.  
 
మనదగ్గర ఇలాంటి ఉద్యోగాలు మనదగ్గర ఇంకా రాలేదు.  కానీ, విదేశాల్లో  ఇప్పటికే అమలులో ఉన్నాయి.  పెద్ద పెద్ద కంపెనీలు ఇలాంటి వారిని నియమిస్తోంది.  ఆత్మీయంగా కౌగిలింత ఇచ్చిన వారికి గంటకు 60 డాలర్లు చెల్లించేందుకు సిద్ధం అయ్యింది.  ఈ ఉద్యోగాలకు ఇప్పుడు అక్కడ మంచి గిరాకీ ఏర్పడింది.  ఈ ఉద్యోగాల్లో చేరేందుకు  యువత పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు.  అంతేకదా మరి.. కౌగిలించుకోవడం అంటే ఎవరికైనా ఆనందమే కదా మరి.  గంటకు 60 డాలర్లు అంటే మామూలు విషయమా చెప్పండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: