రజినీకాంత్ మాస్ హీరో.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.  ప్రస్తుతం ఈ హీరో దర్బార్ సినిమా చేస్తున్నాడు.  షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి.  


ఈ మూవీ తరువాత రజినీకాంత్ శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.  అజిత్ తో శివ వరసగా నాలుగు హిట్స్ కొట్టాడు.  అజిత్ తరువాత శివ దర్శకత్వంలోరజిని చేయబోయే సినిమా కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమా తరువాత రజినీకాంత్ పార్టీ పెట్టె ఉద్దేశ్యంలో ఉన్నాడు.  సంక్రాంతికి రజినీకాంత్ తన కొత్త పార్టీని ప్రకటిస్తారని తెలుస్తోంది.  రజినీకాంత్ పార్టీ ఏంటి.. సింబల్ ఏంటి అన్నది త్వరలోనే తెలుస్తుంది.  


ఎప్పటినుంచో అభిమానులు రజిని పొలిటికల్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  పొలిటికల్ విభాగంలో రజినీకాంత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.  2017, డిసెంబర్ 31 కి రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడి.. 2018 లో తన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్తానన్న రజిని ఆ తరువాత పార్టీ గురించి పెద్దగా మాట్లాడలేదు.  


అసలు రజినీకాంత్ పార్టీ పెట్టె ఉద్దేశ్యం ఉన్నదా లేదా అన్నది కూడా చాలామంది డైలమాలో ఉన్నారు.  రజిని మక్కల్ మంద్రం పేరుతొ అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ పేరుతోనే రజినీకాంత్ పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి.  నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు.  దీన్ని బట్టి చూస్తుంటే.. వచ్చే సంక్రాంతికి రజినీకాంత్ తన పొలిటికల్ గేమ్ ను ప్రారంభించబోతున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది.  రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అది మరొక సంచలనంగా మారుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.  తమిళ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోవడం ఖాయం అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: