ప్రపంచంలో ప్రతి దేశం ఎంతగా అభివృద్ధి చెందింది అంటే.. తమ దగ్గర తింటానికి తిండి లేకపోయినా.. ప్రజలు నివసించడానికి సరైన వసతులను కల్పించకపోయినా.. ఆయుధాలను సమకూర్చుకోవడంలో మాత్రం ముందు ఉంటున్నాయి. నిధులు లేకపోయినా సరే.. అప్పులు చేసి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాయి.  ఇదంతా ఎందుకు అంటే.. శత్రువుల నుంచి రక్షణ కోసం అని సింపుల్ గా చెప్తున్నాయి.  


దేశం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే.. ఇలా ఎందుకు చేస్తున్నట్టు..ప్రపంచంలో అధికంగా బలమైన దేశాల మొదలు బలహీనమైన దేశాల వరకు అన్ని దేశాలు ఆయుధాలను సమకూర్చి పెట్టుకుంటున్నాయి.  ఎప్పుడు ఎవరు ఎలా ఎటాక్ చేస్తారో తెలియదు.  అయితే, తాజా సమాచారం ప్రకారం..మరికొద్ది సంవత్సరాల్లో ప్రజల మధ్య వైరం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.  



ఆధిపత్యం కోసం ధనిక దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది.  ఈ ఆధిపత్య పోరులో తప్పనిసరి పరిస్థితుల్లో పేద దేశాలు కూడా యుద్దాన్ని చేయాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు.  ఈ దేశాల మధ్య జరిగే పోరాటం ఎలా ఉండబోతుంది అన్నది తెలియడం లేదు.  కానీ, ఫ్యూచర్ లో మాత్రం తప్పనిసరిగా ప్రపంచంలోని దేశాల మధ్య మాత్రం యుద్ధం జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. 


మొన్నటి వరకు అమెరికాతో సఖ్యతగా ఉండేందుకు అంగీకారం తెలిపిన ఉత్తర కొరియా ఇప్పుడు మరలా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఆసియాలో భయాందోళనలు రేకిస్తోంది. అమెరికాను తలొగ్గే సమస్య లేదని చెప్తోంది.  సొంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటూ యుద్ధవాతావారణాన్ని సృష్టిస్తోంది.  మరోవైపు, అరబ్ దేశాల్లో ఇరాన్ ను ఇరకాటంలో పెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.  చమురు కోసం రెండు దేశాల మధ్య యుద్దపూరితమైన వాతావరణం నెలకొంటోంది.  ఇది అయన దేశాలకు మంచిది కాదు.  యుద్ధం కారణంగా అమెరికా ఇప్పటికే చాలా లాస్ అయ్యింది.  ఇప్పుడు మరలా యుద్ధం చేస్తే దాని వలన పూర్తిగా దెబ్బతింటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: