చంద్రబాబు తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవడం మంచిదని లేకపోతే,  ప్రకృతి ప్రకోపానికి గురి కావాల్సి వస్తుందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు హెచ్చరించారు . చంద్రబాబు క్షేమం కోసం చెబుతున్నామని వెంటనే అయన ఇల్లు ఖాళీ చేస్తే మంచిదని అన్నారు . ఐదేళ్లు ముఖ్యమంత్రి గా ఉండి చంద్రబాబు అమరావతి లో సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదో అర్ధం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో ఈ స్థాయి వరద అరుదని, 10 ఏళ్ల క్రితం వచ్చాయని , ఇప్పుడు మళ్ళీ వస్తోందని అన్నారు.  ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి కృష్ణా ప్రవాహం చూసి ప్రజలు ఆనందిస్తుంటే ,  ఒక కుటుంబం మాత్రం బాధతో ఉందని ఎద్దేవా చేశారు .


 కృష్ణా నది వరద నా కొంప ముంచడానికి అని చంద్ర బాబు ఆందోళన చెందుతున్నారని అపహాస్యం చేశారు .  హై సెక్యురిటి జోన్ లో ఉన్న చంద్రబాబు ప్రమాదకరమైన ఇంట్లో ఎందుకు వుంటున్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు .  370 రద్దుతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వచ్చినంత కోపం, ఇప్పుడు వరదలను చూసి  చంద్రబాబు కు అంతే కోపం వస్తోందని అన్నారు . చంద్రబాబు నాయుడు నివసిస్తోన్న ఇల్లు అక్రమ కట్టడమని, నది ప్రవాహంలో ఉందని ముఖ్యమంత్రి  వైఎస్  జగన్ ముందే చెప్పారని గుర్తు చేశారు . అయినా చంద్రబాబు తప్పని తెలిసికూడా మొండిగా అక్కడే వుంటున్నారని విమర్శించారు .


 రాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందని ,  ఇప్పుడు ఉంటున్న కొంప మునిగే పరిస్థితి తలెత్తిందని అన్నారు . ఎన్నికల ముందు నీ చమైన ప్రచారాల వల్లే ప్రజలు  ఛీ కొట్టారనీ , ఇంటి విషయంలో తప్పు చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు . నోటీస్ ఇచ్చేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బంది ని కూడా రానివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: