కృష్ణా నది వరదలతో పొంగి పొర్లుతోంది.  ఆంధ్రప్రదేశ్ లోని పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురౌతున్నాయి. ముంపు ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు  పడుతున్నారు. కరకట్ట సమీపంలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం లోకి కూడా  వరద నీరు వచ్చి చేరింది . ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదమే నడుస్తోంది. వరదల కారణంగా సామాన్య ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా  ప్రజల గురించి  అధికార, ప్రతిపక్ష నేతలు పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  కన్నా లక్ష్మీ నారాయణ  మండిపడుతున్నారు.


ఓ వైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే,  ఏమీ పట్టనట్లు  ఏపీ సీఎం జగన్ , ప్రతిపక్ష నేత చంద్రబాబు  వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అమెరికా పర్యటనపై అయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు . అదేవిధంగా... ప్రతి పక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ లో ఉండటాన్ని కూడా కన్నా తప్పుపట్టారు. రాష్ట్రంలో వరదల సమయంలో ప్రజల బాగోగులు ఏమాత్రం  పట్టని సీఎం అమెరికా వెళ్లారని,  5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి తన కొంప మునిగింది   హైదరాబాద్ జారుకున్నారని ఎద్దేవా చేశారు .


 రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుంటే   ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని , ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్ లో మకాం వేయడాన్ని తప్పు పడుతూ , వారిద్దరి  వ్యవహార శైలి ని  ప్రజల్లో చర్చ పెట్టాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది . అందులో భాగంగానే ముఖ్యమంత్రి  జగన్ , ప్రతిపక్ష నేత చంద్రబాబు ను కన్నా లక్ష్మీ నారాయణ టార్గట్ చేసినట్లు స్పష్టం అవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . దీనితో  రెండు పార్టీల అధినేతల పై   ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలు లేకపోలేదని కమలనాథులు అంచనా వేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: