రెండు రోజుల నుంచి టీడీపీ అర్ధం పర్ధం లేని డ్రోన్ల రాజకీయం చేస్తుంది. నిజానికి చంద్రబాబు అసలు విషయాన్ని డైవర్ట్ చేయడానికి నా భద్రత, వైసీపీ కక్ష అంటూ డ్రామాలు ఆడుతున్నారు. బాబుగారు ఏంటి ఒక పక్క లోకేష్ ఇంకొక పక్క మాజీ మంత్రి ఉమా ఎక్కడ లేని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే కృష్ణా నది వరద వల్ల చంద్రబాబు ఉంటున్న ఇల్లుకు ముంపు వచ్చింది. ఆ వరద నీరు ఇంటి లోపలికి రాకుండా సుమారు 20 మందు కూలీలతో ఇసుక బస్తాలు వేశారు. ఈ విషయాన్ని ఏకంగా టీడీపీ మీడియానే ధృవీకరించింది. అంటే ఇసుక బస్తాలు వేయకపోతే చంద్రబాబు ఇల్లు మునిగి పోయే పరిస్థితి. ఇది ఇప్పుడు చంద్రబాబు ఇంటి పరిస్థితి. 


ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం డ్రోన్ లు .. వరద నీరును మల్లించారు అంటూ కొత్త డ్రామా షురూ చేశారు. ఆల్రెడీ లోకేష్ కూడా ట్వీట్ చేసిన సంగతీ తెలిసిందే. వైసీపీ పార్టీ కక్ష కట్టి పెద్ద పడవల సహాయంతో వరద నీటిని వారి ఇంటి మీదకు పంపించిందంటా .. ట్వీట్ చేసిన లోకేష్ కు బుర్ర ఉందో లేదో తెలియదు గాని .. ఈ న్యూస్ చదివే జనాలకు మాత్రం బుర్ర పాడయిపోతుంది. ఇలా టీడీపీ నేతలు రంగంలోకి దిగి అసలు విషయాన్ని దాచి తేలుకుట్టిన దొంగల మాదిరిగా ఏదేదో చెబుతున్నారు. 


చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమని ఇంత కంటే నిదర్శనం ఇంకేమి కావాలి. అయినా చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా ఇప్పుడు అమరావతిలో లేరు. ఇద్దరు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఏపీలో వరదలు వస్తుంటే .. వీళ్ళు మాత్రం హైదరాబాద్ లో ఉండి ట్విట్టర్ రాజకీయాలు చేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో కనీసం ఒక ఇల్లును కూడా చంద్రబాబు అమరావతిలో నిర్మించుకోలేకపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ప్రతి పక్ష హోదాకు పరిమితం అవ్వటంతో అధికార పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడతూ బాబుగారు ఇంకా మారలేదని నిరూపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: