దేశంలో ఎంతో ప్రతిష్టాత్మక ఆసుపత్రుల్లో ఒకటి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి.  ఇక్కడ అన్ని విషయాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుంటారు.  సినీ, రాజకీయ సెలబ్రెటీలు వారి ఆరోగ్యానికి సంబంధించి అన్ని శస్త్ర చికిత్సలు ఇక్కడ తీసుకుంటారు.  తాజాగా ఈ ఇదే ఆసుపత్రిలో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి కూడా చికిత్స అందిస్తుండగా పక్క బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపింది. తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజన్లతో ఆసుపత్రి వద్దకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.  ఈ ప్రమాదం మొదటి అంతస్తులో జరగగా అది రెండో అంతస్తు వరకు పొగలు వ్యాపించడంతో అక్కడే చికిత్స తీసుకుంటున్న పేషెంట్స్ బంధువుల ఆందోళనతో అటూ ఇటూ పరుగులు తీశారు. ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఏడు నుంచి ఎనిమిది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోగా.. సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

కాగా,  అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలు అదుపుచేస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అపరేషన్ థియేటర్ బేస్‌మెంట్ నుంచి మంటలు చెలరేగాయని తెలుస్తోంది. అగ్నిప్రమాదంపై సాయంత్రం 6.13గంటలకు తమకు సమాచారం అందిందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు.

ది ఏమైనా ఇలాంటి ప్రమాదాల వల్ల ఎంతో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని..పెద్ద హాస్పిటల్ కావడంతో ఎక్కువగా ఎటక్ట్రానిక్ పరికరాలు ఉండటంత వల్ల ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.  ఏది ఏమైనా  కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి  ఎలాంటి ప్రమాదం లేదని తెలిసిన తర్వాత నేతలు, అభిమానులు, కార్యక్తలు ఊపిరి పీల్చుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: