ప్రకాశం బ్యారేజీ ప్రమాదకర స్థితిలో పడింది. దీంతో వారది పై రాకపోకల విషయంలో ఆంక్షలు విధించారు అధికారులు. బ్యారేజ్ బలహీనంగా ఉందంటూ ఫ్లెక్సీలు పెట్టారు. ఫోర్ వీలర్స్, ఆటోలు బ్యారేజీ పైకి వెళ్లకుండా నిషేధం విధించారు. భారీ స్థాయిలో నీరు ప్రకాశం బ్యారేజీకి చేరడంతో ముందు జాగ్రత్తగానే హెచ్చరికల్ని చెప్తుంది సిబ్బంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు విజయవాడ కృష్ణలంకలో ఇళ్ళ పైకి చేరింది. డాబాల మీద ఉంటున్న బాదితులను బోట్లలోకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.


అయితే కొందరు బాధితులు పునరావాస ప్రాంతాలకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. పదేళ్ల తరవాత క్రిష్ణమ్మ పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రకాశం బ్యారేజీకి దిగువన ఎటువంటి ఉధృతి ఎటువంటి ప్రవాహం ఉందో దాదాపు 8.25 లక్షల క్యూసెక్కుల మేర నీరు దిగువకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎన్ని గేట్లు అయితే ఉన్నాయో అన్ని గేట్లను కూడా పూర్తిగా వదిలేసి పూర్తి స్థాయిలో ఎత్తి  దిగువకి పూర్తిగా నీటిని 8.25 లక్షల క్యూసెక్కుల మేర నీటిని కిందకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ సందర్శకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కృష్ణమ్మ అందాలను, కృష్ణమ్మ వరద ఉధృతిని తనివితీరా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: