ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది 30 అగ్ని మాపక శకటాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డు భవనంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.       


ఒకటో అంతస్థు, రెండో అంతస్థుకు మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలను, రోగులను అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలిస్తోంది. కాగా ఇదే ఆసుపత్రిలో మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనకు వేరొక భవనంలో చికిత్స జరుగుతోంది. అయితే అగ్ని ప్రమాదం ప్రభావం ఆ భవనంపై పడే అవకాశం లేదని సమాచారం. 


గత కొద్దీ కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న జైట్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రస్తుతం జైట్లీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రి మొత్తం పోగతో నిండిపోయింది. కాగా ఈ విషయంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతమంది ప్రజలు ఉన్న ఆసుపత్రిలో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోరా అంటూ మండిపోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: