ప్రభుత్వ మూసివేసిన అన్నా క్యాంటీన్ లను తిరిగి తెరిచే దాకా విశాఖ కేజీహెచ్ దగ్గర ఉన్న క్యాంటిన్ ను తానే నడుపుతా నని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు. కేజీహెచ్ దగ్గర వున్న అన్నా క్యాంటీన్ ను ఆయన మళ్ళీ ప్రారంభించారు ఇంతకు ముందు కంటే మెరుగైన భోజనం పెడతామని తెలిపారు ఇప్పటి కైనా క్యాంటీన్ లను తిరిగి తెరవాలని ప్రభుత్వాని కి విన్నవించారు. 


"రాష్ట్రవ్యాప్తంగా తెరిచేంత వరకు కూడా కేజీహెచ్ దగ్గరుండి అన్నా క్యాంటీన్ లను నడపాల ని చెబితే నా సొంత నిధుల తో ఆ చిన్న ప్రయత్నమే ఈ రోజు రెండో రోజు కూడా ఈ రోజు సుమారు మూడు వందల మూడు వందల యాభై మంది భోంచేసేందుకు ఏర్పాటు చేస్తున్నాము." అని గణేష్ తెలిపారు.


అలాగే  " ప్రతి రోజు కూడా వీళ్ళు సంవత్సరం తినకపోతే సంవత్సరం  పాటూ పెడతాం. అలా పెట్టేందుకు మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఎప్పుడూ డబ్బు కోసం మేము రాజకీయం చేయలేదు, పేదవాళ్ళ కోసం చేసే సేవే  ఒక రాజకీయం అనుకున్నాం. ఎక్కడెక్కడి నుండో వచ్చారు ఈ టైమ్ లో ఈ ప్రాంతం లోనే భోజనం చేయాలంటే సుమారు నూట యాభై రూపాయలు పెడితే గానీ, అది కూడా ఆటోల్లో వెళ్లే ఆటోలు వెళ్ళి తిని రావాల్సిన పరిస్థితి."  అని గనేష్ వాపోయారు.


"  దయచేసి ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నాను,   పేద ప్రజల కడుపు మాత్రం కొట్టద్దు, ప్రభుత్వం మళ్ళీ కళ్ళు తెరిచి పెట్టేంత వరకూ కూడా  ఈ అన్న క్యాంటీన్ ను ఈ కేజీహెచ్ దగ్గర నడుపుతామని  మేము అందరికీ తెలుపుతున్నాము.  ప్రతీ  మధ్యాహ్నం 12:30 మొదలు  పెడతాం,  ఇంకా మెరుగైన అన్నా క్యాంటీన్ గతంలో ఉండేదాని కంటే మెరుగైన నాణ్యమైన భోజనం పెట్టాడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం " అని గణేష్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: