హిందువుల ఆలయాల్లో కాస్తో కూస్తో పేరు ఆదాయం రాగానే వాటిని రాష్ట్ర దేవాదాయధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకుంటుంది. ఈవో పేరిట ఆ ఆలయ పాలన సాగుతుంది. అయితే ఈ ఆలయ అధికారులు ఆలయాల, భక్తుల మౌలిక స్వభావాన్ని అర్థం చేసుకోకుండా వివాదాలకు ఆస్కారమిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.


తాజాగా శ్రీశైలం ఆలయంలో తలెత్తిన వివాదమే ఇందుకు కారణం. ఇక్కడి ఆలయంలోని దుకాణాల వేలంపాటల్లో ఇతర మతస్తులను అనుమతిస్తున్నారన్నది బీజేపీ నాయకుల ఆరోపణ. ఆరోపణే కాదు.. అది వాస్తవం కూడా. అయితే ఇదంతా నిబంధనల మేరకే జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. దుకాణాల వేలంపాటలు పాడుకోవడానికి మతంతో సంబంధం లేదని చెబుతున్నారు.


దుకాణాలను ఎవరైనా వేలంపాటలో పాడుకోవచ్చన్నది అధికారుల వాదన. ఇదేమీ కొత్త కాదని..గతం నుంచి ఇలాగే వస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే హిందూ దేవాలయానికి సంబంధించిన పనులు, దుకాణాలు ఇతర మతస్తులు ఎలా నిర్వహిస్తారని.. ఇది చాలా సున్నిత విషయమని బీజేపీ నాయకులు చెబుతున్నారు.


ఇటీవల ఈ వేలం పాటల సమయంలో శ్రీశైలం బీజేపీ నియోజక వర్గ ఇంచార్జ్ బుడ్డా శ్రీ కాంత్ రెడ్డి అన్యమతస్తులపై విరుచుకుపడ్డారు. అక్కడ జరిగిన వివాదంలో ఇద్దరు వ్యక్తులపై చేయిచేసుకున్నట్టు సీసీ టీవీ ఫుటేజ్ లోనూ బయటపడింది. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.


ఈ దేశంలోని అత్యంత పురాతన దేవాలయాల్లో ఒకటి, జ్యోతిర్లింగం మరియు, శక్తి పీఠం అయిన హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంలో హిందువులకు కాకుండా అన్యమతస్థులకు అధికారులు పట్టం కడుతున్నారని భక్తులు మండిపడుతున్నారు. శ్రీశైలం దేవస్థానం పక్కన వేలం పాటలో పాడుకోవాల్సిన షాప్ లు 200 ఉంటే అందులో 42 కి పైగా ముస్లింలలకు కేటాయించారని ఆరోపిస్తున్నారు. చివరకు లడ్డు కాంట్రాక్ట్ లు, గోశాల కాంట్రాక్టులు, బిల్డింగ్ కాంట్రాక్టులు కూడా లోకల్ ముస్లిం లీడర్ లకె కట్టబెడుతున్నారని అంటున్నారు. దేవస్థానం లోపల ప్రైవేట్ సెక్యురిటిలో కూడా ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారని చెబుతున్నారు.


దేవాదాయశాఖ ఉన్నది దేవాలయాల పవిత్రత కాపాడటానికే.. భక్తుల సౌకర్యాలు కల్పించడానికే.. దేవాదాయ సిబ్బంది, అధికారుల జీతాలు సైతం భక్తుల హుండీల నుంచే చెల్లిస్తారు. నిబంధన విషయంలో పునరాలోచించి... దేవాలయాల విషయంలో వివాదాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే.


మరింత సమాచారం తెలుసుకోండి: