ఆర్టికల్ 370 ని రద్దు చేసి ఇండియా అతిపెద్ద విజయం సాధించింది. 72 సంవత్సరాలుగా పరిష్కారం కానీ సమస్యకు ఒక పరిష్కారం సూచించింది.  జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులను సమీక్షిస్తున్నది ప్రభుత్వం.  ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆంక్షలను ఎత్తివేసింది.  కొన్ని చోట్ల టెలిఫోన్ వ్యవస్థను పునరుద్ధరించింది.  సెల్ ఫోన్ వ్యవస్థను కూడా త్వరలోనే పునరుద్దరించబోతున్నది.  అంతేకాదు, సోమవారం నుంచి యధావిధిగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కాబోతున్నాయి.  అన్ని రకాల సర్వీసులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.  


పరిస్థితులు ఈ స్థాయిలో స్పీడ్ గా మార్పులు జరుగుతాయని ఎవరూ ఊహించలేదు.  ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన తరువాత కాశ్మీర్ లోయ అల్లకల్లోలంగా మారుతుందని అనుకున్నారు.  కానీ, పరిస్థితి అదుపులో ఉండటంతో పాటు మెజారిటీ ప్రజలు దీనిని ఆమోదించారు.  అభివృద్ధి వైపు అడుగులు వేయబోతున్నది.  ఇక ఇప్పటికే అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అంబానీ గ్రూప్ రెడీ అవుతున్నది.  పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక వర్గాలు రెడీ అవుతున్నాయి.  


ముఖ్యంగా టూరిజంతో పాటు ఐటి రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో మౌళిక వసతులతో కూడిన పరిశ్రమలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.  ఇదిలా ఉంటె, ఇప్పుడు ఇండియాలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ మాత్రమే కాకుండా, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కాశ్మీర్ ను కూడా ఇండియాలో అంతర్భగం చేసుకోవచ్చని, దీనికి చిన్న లాజిక్ ఉందని అంటున్నాడు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి.  


1948 వ సంవత్సరంలో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కాల్పుల విరమణకు సంబంధించిన అంశంపై ఐక్యరాజ్య సమితిలో పిటిషన్ వేశారు.  ఆ పిటిషన్ కారణంగానే ఇండియా ఇప్పటికి లైన్ ఆఫ్ కంట్రోల్ ను దాటలేకపోతున్నది.  ఆ పిటిషన్ ను ఉపసంహరించుకుంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి ఇండియాలో అంతర్భాగం చేసుకోవచ్చని అంటున్నారు.  ఎలాగో జమ్మూ కాశ్మీర్ ఇండియాలో పూర్తిగా అంతర్భాగంగా మారింది.  పైగా మెజారిటీ ప్రజలు దీనికి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రజలు కూడా ఇండియాలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు.  అక్కడి ప్రజల పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయన్నది వాస్తవం.  ఈ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంది కదా.  పాక్ ఎలాగో ఎన్ని చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు.  కుక్కతోక వంకర అనే విధంగా ప్రవర్తిస్తూనే ఉన్నది.  ఆడేది పాకిస్తాన్ అయినా.. దాన్ని అందిస్తున్నది చైనా అనే మాట వాస్తవం.  


మరింత సమాచారం తెలుసుకోండి: