వరదబాధితులు వేరే ఉంటారనుకోవడం పొరపాటే. ఎవరైతే వరదలకు అడ్డంగా వెళ్తరో వారంతా బాధితులే. అదే సినిమాలో చెప్పినట్లుగా రైలు ఎదురుగా వెళ్ళినా. ఆ రైలు మనకు ఎదురుగా వచ్చినా కూడా అది యాక్సిడెంటే మరి. వరదలు కూడా అలాంటివే. శాంతంగా ఉన్నంతసేపు నదులైనా, కాలువలు అయినా ఫరవాలేదు. అవి భీకరమైనపుడు చూడాలి. అసలు కధ.


ఇదిలా ఉండగా ఏపీకి పదమూడేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు ఇపుడు వరదబాధితుడు కావడం వింతల్లో కెల్లా వింత. ఆయన గతంలో ఎన్ని వరదలు చూశాడని. అలాగే,  సహాయ చర్యలు చేపట్టి వరదబాధితులను ఆదుకున్న చంద్రబాబే ఇపుడు బాధితుడు కావడం బాధాకరమే. కరకట్ట వద్ద వరద పొంగిపొరలుతోందని, అందువల్ల ఆ ప్రాంతానికి చెందిన వారు తక్షణం ఇళ్ళు ఖాళీ చేయాలని వేసిన రెవిన్యూ అధికారులు  వేసిన దండోరా జాబితాలో చంద్రబాబు కూడా ఉండడం విశేషం.


కరకట్ట వద్ద అక్రమంగా కట్టిన ఇళ్ళు, ఇతర నివాసాలు ఖాళీ చేయాలంటూ స్థానిక తాసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఇలా నోటీసులు అందుకున్న వారిలో చంద్రబాబు కూడా ఉండడమే ఇక్కడ అతి ముఖ్యమైన  విషయం. బాబు ఎందుకు వరద బాధితుడు అయ్యాడు. ఓ రెవిన్యూ అధికారి చేత ఎందుకు చెప్పించుకునే దాకా పరిస్థితి వెళ్ళిందన్నదే ఇక్కడ చూడాలి. ఎన్నో వరదల నుంచి జనాన్ని చైతన్యపరచి కాపాడిన మాజీ సీఎం తనకు తాను వరదల్లో ఉన్న ఇంట్లోంచి ఖాళీ చేయనని మొరాయించడం ఇక్కడ గమనార్హం.


 ఈ విషయంలో ఎందరు చెప్ప్పినా వినను కాక వినను అంటూ బాబు మొండికేయడంతోనే అసలు సమస్య వస్తోంది. ఏపీకి పెద్ద దిక్కుగా, సీనియర్ సిటిజన్ గా చంద్రబాబు అందరికీ ఆదర్శంగా ఉండాలి. మరి బాబే ఇలా మొరాయించి అక్రమ కట్టడం వదిలి రాను అంటే మిగిలిన సాదర జనం కూడా అలాగే మొండికేస్తారు. కాబట్టి మిగిలిన వరదబాధితులకు స్పూర్తిగా ఉండాలంటే బాబు తక్షణం ఆ ఇల్లు ఖాళీ చేయడం ఉత్తమమని అంతా అంటున్నారు. దీన్ని రాజకీయంగా వాడుకోకుండా ఉంటే ఇంకా మంచిదని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: