అన్నా డిఎంకె పార్టీ గురించి పరిచయం అక్కర్లేదు. జయలలిత ఆ పార్టీని సమర్ధవంతంగా నడిపించింది.  జయలలిత ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎంతో సేవ చేసింది. ఎన్నో పధకాలను రూపొందించింది.  అంతేకాదు, అమ్మ పథకాలకు తమిళనాడులో మంచి ఆదరణ లభించింది. తమిళ ప్రజలు ఒకసారి ఒకరికి పట్టం కడితే, మరోసారి మరో పార్టీకి పట్టం కడుతుంది. 


అయితే గత ఎన్నికల సమయంలో తమిళ ప్రజలు రూటు మార్చారు.  జయలలిత కు రెండోసారి అమ్మకు పట్టం కట్టారు.  అయితే, రెండోసారి అమ్మ అధికారంలోకి వచ్చిన రెండోసారి కొన్ని రోజులకే అమ్మ మరణించింది. అమ్మ మరణానికి కారణం ఏంటి..ఎందుకు అమ్మ మరణించింది అనే విషయాలపై క్లారిటీ రావడానికి చాలా సమయం పట్టింది. 


ఇదిలా ఉంటె, ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా, సర్వైవ్ కావాలన్నా చాలా కష్టం. ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో దానికోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది. విడిగా డబ్బులు ఖర్చు చేయడం వేరు...పార్టీ కోసం డబ్బులు ఖర్చు చేయడం వేరు.  ఒక రాజకీయ పార్టీ సర్వైవ్ కావాలంటే, డబ్బు చాలా అవసరం. డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుంది.  మాములుగా పార్టీలకు డబ్బు విరాళాల రూపంలో వస్తుంది.  కానీ, అన్నా డిఎంకె విషయంలో వేరు. 


అమ్మ ఎవరిని విరాళం ఇవ్వమని అడిగేవారు కాదు. విరాళాలు ఇచ్చినా అమ్మ తీసుకునేది కాదట. తాను సంపాదించిన డబ్బుతోనే జయలలిత పార్టీని నడిపించారు. మ్యానిఫెస్టోలో పెట్టె ప్రతి విషయాన్ని అమ్మ తన సొంత డబ్బుతోనే హామీలు నెరవేర్చేవారని తెలుస్తోంది.  ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా జయలలిత తీసుకున్న చర్యలు ప్రతి ఒక్కరినీ మెప్పించాయని చెప్పొచ్చు. అందుకే వరసగా రెండోసారి కూడా అమ్మకు ఓటర్లు పట్టం కట్టారు. దురదృష్టవశాత్తు అమ్మ మరణించిన సంగతి తెలిసిందే.  అమ్మ తరువాత ముఖ్యమంత్రిగా పలనిస్వామి ఎంపికయ్యారు. అనేక నాటకీయ పరిణామాల తరువాత పలనిస్వామి పన్నీర్ సెల్వం లు కలిసిపోయారు. అయితే, అమ్మకు ఉన్న ఆదరణ వీరికి లేకపోవడంతో నెక్స్ట్ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది అగమ్యగోచరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: