చంద్రబాబునాయుడు రాజకీయ గండరగండడు అన్న సంగతి తెలిసిందే. అవసరానికి ఏది కావాలో దాని కోసం ఏంతకైనా వెళ్ళే లక్షణం ఉన్న నాయకుడు. ఒక్కమాటలో చెప్పాలంటే బాబు రాజకీయం ప్రాక్టికల్ గా ఉంటుంది. రాగ‌ద్వేషాలకు అతీతంగా ఆయన  టార్గెట్ పెట్టుకుని దాన్ని రీచ్ అయ్యందుకే రాజకీయం చేస్తారన్న పేరుంది.


అటువంటి చంద్రబాబు ఈ రోజు సినీ హీరో, తన మేనల్లుడు అయిన జూనియర్ ఎన్టీయార్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ రోజు దివంగత నేత నందమూరి హరిక్రిష్ణ ఆబ్దికం. హరిక్రిష్ణ పరమపదించి ఏడాది అయింది. ప్రధమ వర్ధంతి సందర్భంగా నందమూరి సోదరుల ఇంట్లో జరిగిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు.


ఈ సందర్భంగా హరిక్రిష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చాలా కాలం తరువాత తన మేనల్లుళ్ళు కళ్యాణ్ రాం,  జూనియర్ ఎన్టీయార్  లను కలిసే అవకాశం లభించింది. దాంతో చంద్రబాబు వారితో భేటీ వేశారు. అయితే జూనియర్ తో భేటీ అన్నది మాత్రం రాజకీయంగా అందరి చూపు పడేలా చేస్తోంది. ఎందుకంటే ఆయన మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో ఉన్నారు.


జూనియర్ సైతం జగన్ సర్కార్ తో చనువుగా ఉంటారని వార్తలు వస్తున్నాయి. మధ్యవర్తిగా మంత్రి కొడాలి నాని ఎటూ ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు టీడీపీ దారుణంగా ఓటమి పాలు అయి ఎటూ కాకుండా ఉన్నారు. జూనియర్ వస్తేనే పార్టీ బాగుపడుతుందని అంతా అనుకుంటున్న వేళ కొడుకు లోకేష్ మాత్రమే వారసుడు కావాలని భావిస్తున్న చంద్రబాబు జూనియర్ ని టీడీపీలో తీసుకురావడానికి ఇష్టపడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 


ఈ క్రమంలో జరిగిన ఈ భేటీ మాత్రం అందరి ద్రుష్టిని ఆకర్షించింది. కొడుకు లోకేష్ కి ఇబ్బంది లేని రీతిలో  జూనియర్ ఎన్టీయార్ రాకను టీడీపీలోకి బాబు ఓకే అంటారని అంటున్నారు. అయితే జూనియర్ తన స్థాయి తగ్గించుకోని టీడీపీలోకి రాడన్నది అందరికీ తెలిసిందే. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి ఈ భేటీ ఎన్నో చర్చలకు ఆస్కారం కల్పిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: