దుర‌దృష్ట‌క‌ర‌మే కానీ...గ‌త కొద్దికాలంగా వివాహిత సంబంధాలు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ అవాంచిత ప‌రిణామాలు ర‌క‌ర‌కాల ఇబ్బందులకు కార‌ణంగా మారుతున్నాయి. అయితే, తాజాగా ఓ చిత్ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఓ వివాహిత భ‌ర్త‌తో కలిసి ఉండ‌టం కంటే ప్రియుడే కావాలని కోరుకోవడంతో అక్కడి గ్రామ పెద్దలు విచిత్రమైన తీర్పు చెప్పారు. యువతి భర్తకు 71 గొర్రెలు ఇవ్వాలంటూ ప్రియుడ్ని ఆదేశించారు. ప్రియుడి తండ్రికి తీర్పు నచ్చక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో  ఈ విచిత్ర పంచాయతీ జ‌రిగింది. గ్రామానికి చెందిన యువకుడికి స్థానిక యువతితో ఇటీవల పెండ్లి జరిగింది. కొద్దిరోజులకే ఆమె ప్రియుడు రామ్ నరేశ్‌తో కలిసి పారిపోయింది. భర్తను వదిలేసి లవర్‌తో కలిసి సహజీవనంలో హ్యాపీగా గడిపేస్తున్నారు. ఇటీవల గ్రామంలో భర్త, ప్రియుడు ఒకరికొకరు ఎదురుపడటంతో ఘర్షణ మొదలైంది. విషయం పంచాయతీ పెద్దల వరకు వెళ్లింది. ప్రియుడే కావాలని వివాహిత కోరుకోవడంతో భర్తకు పరిహారంగా ప్రియుడి వద్ద ఉన్న 142 గొర్రెల్లో సగం ఇవ్వాలని తీర్పునిచ్చారు.దానికి అతడు ఒప్పుకొని యువతి భర్తకు 71 గొర్రెలను ఇచ్చేశాడు. అయితే ప్రియుడి తండ్రి ఈ తీర్పును ఒప్పుకొనేది లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


రామ్ నరేశ్ పోలీసుల దగ్గరకు వెళ్లి తన గొర్రెలను మహిళ భర్త దొంగిలించాడంటూ ఫిర్యాదు చేశాడు. రామ్ నరేశ్ తానే గొర్రెల్ని అతనికి ఇచ్చానని బదులిచ్చాడు. అవి తను సంపాదించిన గొర్రెలని వాటిపై కొడుక్కి ఎటువంటి హక్కులేదని వాదిస్తుంటే కనీసం నాకిచ్చే వాటాలో సగం గొర్రెలనైనా తనకు ఇవ్వాలని కోరాడు.  ఆ యువతి మాత్రం తన ప్రియుడితోనే కలిసి ఉంటానని చెప్తోంది.  దీంతో స‌హ‌జంగానే చివరకు కేసు పరిష్కారం బాధ్యత ఖోరాబర్‌ పోలీసులపైకి చేరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: