ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన దాదాపు 80 రోజులు పూర్తి చేసుకుంది.. ఒక నాయకుడి పరిపాలనను అంచనా వేసేందుకు ఇది చాలా తక్కువ సమయమే అయినా.. ఆయన ఏ డైరెక్షన్‌ లో వెళ్తున్నాడు.. ఇంకా ముందుకు ఎలా వెళ్లాలి అని ఆలోచించేందుకు ఈ సమయం పనికొస్తుంది.


ఇప్పటివరకూ జరిగిన పాలన చూస్తే.. జగన్ పరిపాలన విషయంలో సూపర్ హిట్ గా కనిపిస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఆయన తాను అనుకున్న పథకాలను వేగంగా పట్టాలెక్కించడం ప్రారంభించాడు. ఎవరు ఏమన్నా వెరవకుండా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాడు. నవరత్నాల అమలే తన అజెండా అని పదే పదే అధికార వర్గానికి క్లారిటీ ఇస్తున్నారు.


చిన్న ఉద్యోగుల జీతాలు పెంచడం, అమ్మఒడి వంటి పథకాలపై క్లారిటీ ఇవ్వడం.. పించన్లు పెంచడం.. ఇలా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా గ్రామ పరిపాలనకు అవసరమైన ఉద్యోగాలు లక్షల సంఖ్యలో ఇచ్చేశాడు. ఇక ఇవి ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాల్సి ఉంది. ఇంత వరకూ జగన్ పరిపాలన పరంగా సూపర్ హిట్ అని చెప్పొచ్చు.


అదే సమయంలో ఇవే నిర్ణయాల కారణంగా ఆయన రాజకీయంగా మైనస్ అవుతున్నారన్న విషయం గమనించాలి. పరిపాలన లో సూపర్ హిట్ గా నిలుస్తున్నా.. రాజకీయంగా ఫ్లాప్ అవుతున్నారు. పోలవరం రీ టెండర్లు, అన్నా క్యాంటీన్ల మూసివేత వంటి నిర్ణయాల కారణంగా వైఎస్ జగన్ రాజకీయంగా చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి అవకాశాల కోసమే ఎదురు చూసే ఎల్లో మీడియా వీటిని బూతద్దంలో చూపి... రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందనే కోణంలో ప్రజంట్ చేయడం ప్రారంభించాయి.


పీపీఎ ల విషయంలో కేంద్రం రాసిన లేఖలు.. జపాన్ వంటి ప్రభుత్వాల నుంచి వచ్చిన లేఖలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులకు అవరోధం అన్నట్టు కలరింగ్ ఇస్తున్నాయి. ఇవి ప్రజల అభిప్రాయంపైనా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. దీనికితోడు ఇలాంటి విమర్శలకు సరైన సమాధానాలు కూడా పార్టీ నుంచి లభించడం లేదు. సో.. రాజకీయాల పరంగా జగన్ కొంత మైనస్ లో ఉన్నారనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: