కడప జిల్లాలో తొందరలో చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తప్పదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరికీ అదే అనుమానంగా ఉంది. చంద్రబాబు ఎంతగానో నమ్ముకున్న ఫిరాయింపు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బిజెపి నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చంద్రబాబు మీడియా కూడా ధృవీకరించింది. ఢిల్లీలోని బిజెపి అగ్రనేతలతో ఇప్పటికే ఆది చాలాసార్లు మాట్లాడారట. కాబట్టి తొందరలోనే టిడిపికి రాజీనామా చేసేయటం ఖాయమనే అనిపిస్తోంది.

 

నిజానికి ఆదికి సొంతంగా ఉన్న బలం కొంచెం మాత్రమే. పార్టీ బలమే  కుటుంబం బలంగా ఆది రాజకీయాలు  చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్నంత కాలం వైఎస్ మద్దతుదారులుగా రాజకీయాలు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి మద్దతుదారునిగా చెలామణి అయి రాజకీయాలు చేశారు.  ఆ తర్వాత చంద్రబాబుతో కుమ్మకై ఫిరాయింపుకు పాల్పడి తెలుగుదేశంపార్టీలోకి మారిపోయారు. అప్పటి నుండి జగన్ కు బద్ద విరోధిగా మారిపోయి రాజకీయాలు చేస్తున్నారు.

 

తమ మద్దతుతోనే వైఎస్ అయినా జగన్ అయినా రాజకీయాలు చేశారని తాము లేకపోతే జమ్మలమడుగులో వైసిపి జెండా కట్టేందుకు కార్యకర్తలు కూడా ఉండరంటూ చాలా పెద్ద మాటలే మాట్లారు. చంద్రబాబు మెప్పుకోసం జగన్ ను, ఆయన కుటుంబాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరూ చూసిందే.  జగన్ వల్ల తాను గెలవలేదని తన సత్తా ఏంటో 2019లో చూపిస్తానంటూ జగన్ ను ఆది ఎన్నోసార్లు సవాలు చేశారు.

 

తీరా 2019 ఎన్నికలు వచ్చేసరికి ఆదిని చంద్రబాబు జమ్మలమడుగులో ఎంఎల్ఏగా కాకుండా కడపలో ఎంపిగా పోటి చేయించారు. దాంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా కడపలో ఎంపిగా పోటి చేసిన ఆది, జమ్మలమడుగులో ఎంఎల్ఏగా పోటి చేసిన రామసుబ్బారెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. దానికితోడు టిడిపి కూడా ఘోరంగా ఓడిపోవటంతో ఆదిని పట్టించుకునే వాళ్ళే లేకపోయారు. దాంతో వేరే దారిలేక రాజకీయ మనుగడ కోసం ఆది బిజెపిలో చేరటానికి నిర్ణయించుకున్నట్లు ఎల్లోమీడియానే చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: