ఏపీ సీఎంగా జగన్ రాష్ట్రంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమమే దిశగా తన పాలన ఉంటుందని .. తన ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తానని చెప్పారు. ఇప్పటీకే ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా కాంట్రాక్టు పనులు అత్యంత పారదర్శకంగా ఉండేందుకు జ్యూడిషల్ కమీషన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ తీసుకువస్తున్నారు. అదే సమయంలో జగన్ .. తన మంత్రి వర్గానికి గట్టిగ హెచ్చరికలు చేశారు తన ప్రభుత్వంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే నెక్స్ట్ మినిట్ క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని చెప్పారు. ఇప్పటికే ఒక సెటిల్ మెంట్ లో దొరికిపోయిన మంత్రిని హెచ్చరించారు. 


అయితే జగన్ మంత్రుల మీద నిఘా పెట్టడానికి ఇంటెలిజెంట్ వ్యవస్థను పటిష్టం చేయబోతున్నారు. గత ప్రభుత్వంలో ఇంటెలిజెంట్ వ్యవస్థను స్వయంగా తన మంత్రుల మీద పెట్టిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగి పోయారు. అయినా టీడీపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంది. గత ప్రభుత్వం చేసిన తప్పులను చేయకూడదని జగన్ బలంగా ఫిక్స్ అయ్యారు. 


అధికారంలో ఉన్నాము కదా అని అవినీతికి పాల్పడితే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని జగన్ కు తెలుసు. అందుకే తన పాలనా ఐదేళ్లు కాదు.. పది కాలాలు పాటు ప్రజా గుండెల్లో చెరగని ముద్ర వేయాలని జగన్ తాపత్రయం పడుతున్నారు. అందుకే జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏ మంత్రి అయినా అవినీతికి పాల్పడితే అధినాయకుడి దగ్గర దొరికిపోతారు. ఆ విధంగా నిఘా వ్యవస్థను జగన్ తయారు చేస్తున్నారు. దీనితో మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దీనితో మంత్రులకు సెటిల్మెంట్ జోలికి వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: